సాధ్వీ ప్రజ్ఞాసింగ్ కు బెయిల్ తిరస్కరణ

28 Jun, 2016 17:41 IST|Sakshi

ముంబయి: మాలెగావ్ పేలుళ్ల కేసులో ప్రధాన నిందితురాలు సాధ్వీ ప్రజ్ఞాసింగ్ ఠాకూర్కు  ప్రత్యేక మోకా కోర్టులో చుక్కెదురు అయింది. ఆమె దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ను కోర్టు మంగళవారం తోసిపుచ్చింది.  యూఏపీఏ, ఐపీసీ, ఆయుధాల చట్టం, పేలుడు పదార్థాల చట్టం కింద విచారణ కొనసాగుతున్నందున ప్రజ్ఞాసింగ్  కు బెయిల్ ఇవ్వటం సాధ్యం కాదని ప్రత్యేక న్యాయమూర్తి ఎన్ఏ టికొలే తెలిపారు. కాగా మాలెగావ్ బాంబు పేలుళ్ల కేసులో సాధ్వి ప్రజ్ఞాసింగ్ ఠాకూర్‌కు ఈ ఏడాది మే  నెలలో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) క్లీన్‌చిట్ ఇచ్చిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో ప్రజ్ఞాసింగ్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ను కోర్టు తిరస్కరించింది.

కాగా 2008 నాటి ఈ పేలుళ్ల కేసులో ఆమెపైన, మరో ఐదుగురి పైన చేసిన అన్ని అభియోగాల్ని ఎన్‌ఐఏ శుక్రవారం ఉపసంహరించుకుంది. అదే సమయంలో లెఫ్టినెంట్ కల్నల్ ప్రసాద్ శ్రీకాంత్ పురోహిత్‌సహా మరో పదిమందిపై మహారాష్ట్ర కంట్రోల్ ఆఫ్ ఆర్గనైజ్డ్ క్రైమ్(మోకా) చట్టం కింద చేసిన అభియోగాలను సైతం ఉపసంహరించుకుంది. తమ దర్యాప్తులో ప్రజ్ఞ, మరో ఐదుగురికి వ్యతిరేకంగా ఏవిధమైన సాక్ష్యాలు లభించలేదని ఎన్‌ఐఏ ప్రకటించింది. వారిపై  అభియోగాలు కొనసాగించదగినవి కావంటూ అనుబంధ చార్జిషీట్‌ను ప్రత్యేక కోర్టులో దాఖలు చేసింది. 2008, సెప్టెంబర్ 29న మాలెగావ్‌లో జరిగిన జంట పేలుళ్లలో ఏడుగురు మరణించడం తెలిసిందే. కాగా కోర్టు తీర్పుపై హైకోర్టుకు వెళతామని సాధ్వి కుటుంబ సభ్యులు తెలిపారు.

Read latest State News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

తమిళ హిజ్రాకు కీలక పదవి

ఫలించిన ట్రబుల్‌ షూటర్‌ చర్చలు

రెబల్‌ ఎమ్మెల్యే నాగరాజ్‌తో మంతనాలు

పెళ్లిళ్లను కాటేస్తున్న కుల తేడాలు

ఆ బాలుడిని పాఠశాలలో చేర్చుకోండి

కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసిన టిక్‌టాక్‌

నిరాడంబరంగా న్యాయవాది నందిని పెళ్లి

విద్యార్హతలు ఎక్కువగా ఉంటే ఉద్యోగాలకు అనర్హులే!

రోమియో టీచర్‌

కలెక్టర్‌కు కటకటాలు 

‘ఆ అమ్మాయిలు ఆత్మహత్యలు చేసుకుంటారు’

కర్ణాటకలో ఏం జరగబోతోంది?

రామలింగారెడ్డితో కుమారస్వామి మంతనాలు

బళ్లారి ముద్దుబిడ్డ వైఎస్సార్‌

వేలూరులో రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి

కుమారస్వామి రాజీనామా చేస్తారా? 

ఎమ్మెల్యేల రాజీనామాలకు ఈ నాలుగే కారణమా? 

మీరు మనుషులేనా? ఎక్కడేమి అడగాలో తెలియదా?

పాముతో వీరోచితంగా పోరాడి..

హైదరాబాద్‌ బిర్యానీ ఎంతపని చేసింది?

అసెంబ్లీలోకి నిమ్మకాయ నిషిద్ధం

మాంగల్య బలం

పరోటా గొంతులో చిక్కుకుని నవ వరుడు మృతి

వేలూరు లోక్‌సభకు ఎన్నికల షెడ్యూల్‌ విడుదల

బిగ్‌బాస్‌ హౌస్‌లోకి వనిత కూతురు

కంచిలో విషాదం

భర్తను పట్టించిన ‘టిక్‌టాక్’

కర్ణాటకలో ఘోర ప్రమాదం..12 మంది మృతి

మరో చెన్నైగా బెంగళూరు !

మాకూ వీక్లీ ఆఫ్‌ కావాలి

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

ఏం వెతుకుతున్నారు?

అదే నా ప్లస్‌ పాయింట్‌

‘అవును.. మేము పెళ్లి చేసుకున్నాం’

విలక్షణ నటుడి సరికొత్త అవతారం!

ఉత్కంఠ భరితంగా ‘వార్‌’ టీజర్‌

‘బాటిల్‌ని తన్నకండి.. నీటిని కాపాడండి’