యువతికి నగ్నచిత్రాలు పంపి బ్లాక్‌మెయిల్

25 Nov, 2016 01:19 IST|Sakshi
యువతికి నగ్నచిత్రాలు పంపి బ్లాక్‌మెయిల్
  హైదరాబాద్‌కు చెందిన టెక్కీ అరెస్ట్  
  బెంగళూరు (బనశంకరి): ఓ యువతికి నగ్న చిత్రాలు పంపి వివాహం చేసుకోవాలని బ్లాక్‌మెయికు పాల్పడుతున్న సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ను గురువారం బెంగళూరులోని హెచ్‌ఏఎల్ పోలీసులు అరెస్ట్ చేశారు. బోరంచి రాజు అనే సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు సంస్థలో పనిచేస్తున్నాడు. గతంలో ఇదే సంస్థలో ఇంటర్న్‌షిప్ చేస్తున్న ఓ యువతితో అతనికి పరిచయం ఏర్పడింది. ఇద్దరూ స్నేహితులుగా మెలిగారు. ఏడాది క్రితం ఆ యువతికి బెంగళూరులోని ఎలక్ట్రానిక్ సిటీలో ఉన్న టాటా కన్సల్టెన్సీ సర్వీస్ (టీసీఎస్)లో ఉద్యోగం లభించింది.
 
  దీంతో ఆమె హైదరాబాద్ నుంచి నగరానికి కుటుంబంతో కలసి వచ్చేసింది. అప్పటి నుంచి బోరంచి రాజు ఆమెకు మెసేజ్‌లు పంపుతూ, కాల్ చేస్తూ వివాహం చేసుకోవాలని వేధించేవాడు. ఇందుకోసం దాదాపు 8 సిమ్‌కార్డులను ఉపయోగించాడు. అతని మెసేజ్‌లు, ఫోన్‌కాల్స్‌ను ఆమె పట్టించుకోలేదు. ఇటీవల ఆమెకు వేరే యువకుడితో వివాహం నిశ్చయమైంది. ఈ సమా చారం తెలుసుకున్న రాజు.. ఆమె ల్యాప్‌టాప్ నుంచి గతంలో దొంగి లించిన కొన్ని నగ్న చిత్రాలను పంపి తనను పెళ్లి చేసుకోవాలని బ్లాక్ మెయిల్ చేశాడు. అయినా ఆమె ఖాతరు చేయకపోవడంతో వాటిని కాబోయే భర్తతో పాటు అతని కుటుంబ సభ్యులకు మెయిల్ చేశాడు. ఈ విషయాన్ని వారు ఆమెకు తెలిపి.. అనంతరం హెచ్‌ఏఎల్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. 
 
 ఫోన్ నంబర్ ఆధారంగా నిందితుడి గుర్తింపు
 ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న సర్కిల్ ఇన్‌స్పెక్టర్ సాదిక్‌పాషా రెండు ప్రత్యేక పోలీస్ బృందాలను రంగంలోకి దింపారు. నిందితుడి ఫోన్ నంబర్ ఆధారంగా అతన్ని గుర్తించి గురువారం హైదరాబాద్‌లో అరెస్ట్ చేశారు. నిందితుడు తాను ఇంటెలిజెన్‌‌స బ్యూరో అధికారినంటూ పోలీసులను కూడా బెదిరించాడని బెంగళూరు తూర్పు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (డీసీపీ) బోరలింగయ్య తెలిపారు.
 
మరిన్ని వార్తలు