బంగారం మాత్రలు మింగి బుక్కు...

9 Sep, 2017 19:47 IST|Sakshi

సాక్షి, చెన్నై : మాత్రల రూపంలో తయారు చేసిన బంగారాన్ని మింగి విదేశాల నుంచి వస్తున్న ఓ వ్యక్తిని చెన్నై విమానాశ్రయం అధికారులు పట్టుకున్నారు. అరబ్‌దేశం నుంచి వచ్చే విమానంలో బంగారం అక్రమంగా రవాణా అవుతున్నట్లు దిండుక్కల్‌ జిల్లా కాళికొడువై సమీపంలో ఉన్న కరిప్పూర్‌ విమానాశ్రయ అధికారులకు శుక్రవారం రహస్య సమాచారం అందింది. దీంతో అప్రమత్తమైన అధికారులు విమాన ప్రయాణీకులను నిశితంగా గమనిస్తున్నారు.

అదే సమయంలో అనుమానాస్పదంగా నడిచి వస్తున్న ఓ యువకుడిని పట్టుకుని విచారణ చేశారు. అప్పుడు అతను పొంతన లేని సమాధానాలు చెప్పటంతో ఎక్స్‌రే ద్వారా అధికారులు పరిశీలన చేశారు. అప్పుడు అతని కడుపులో ఏదో పదార్ధం ఉండలుగా ఉన్నట్లు తేలింది. అనంతరం అధికారులు ఆ యువకుడిని కోళిక్కాడు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకుని వెళ్లారు. అనంతరం ఆపరేషన్‌ చేసి కడుపులో మాత్రల ఆకారంలో ఉన్న బంగారాన్ని బయటికి తీశారు. ఆ మాత్రల విలువ రూ.7లక్షలని లెక్కగట్టారు. విచారణలో నిందితుడిని కోళికొడువై సమీపంలో ఉన్న కొడువళ్లి ప్రాంతానికి చెందిన నావాస్‌ (34)గా గుర్తించారు. ఈ మేరకు అతనిపై అధికారులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.

మరిన్ని వార్తలు