హాస్పిటల్లో మతిస్థిమితం లేని వ్యక్తి హల్‌చల్

7 Nov, 2016 16:17 IST|Sakshi
నూజివీడు: కృష్ణాజిల్లా నూజివీడు ప్రభుత్వాస్పత్రిలో ఓ మతిస్థిమితం లేని వ్యక్తి బీభత్సం సృష్టించాడు. ఆస్పత్రిలో వార్డు బాయ్‌పై దాడిచేసి ఆస్పత్రిలోని అద్దాలను పగులగొట్టి నానా హడావుడి చేశాడు. అడ్డువచ్చిన వారిని బెదిరించి గోడ దూకి పరారయ్యాడు. ఆస్పత్రి సెక్యూరిటీ సిబ్బంది వెంబడించడంతో పక్కనే ఉన్న ట్రిపుల్ ఐటీలోకి ప్రవేశించాడు. దీంతో అక్కడి సిబ్బంది ఆ వ్యక్తిని బంధించి పట్టణ పోలీసులకు అప్పగించారు. అతడి పేరు, ఇతర వివరాలు తెలియాల్సి ఉంది.
మరిన్ని వార్తలు