మనోహరాబాద్‌- కొత‍్తపల్లి రైల‍్వే పనులు ప్రారంభం

14 Mar, 2017 13:36 IST|Sakshi
మెదక్: మనోహరాబాద్-కొత్తపల్లి రైల్వేలైన్ పనులను గజ్వేల్ మండలం గిరిపల్లి దగ్గర మంత్రి హరీశ్‌రావు మంగళవారం ఉదయం భూమి పూజ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ... కేంద్ర, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో చేపడుతన్న ఈ ప్రాజెక్టును త్వరలోనే పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపారు. మేడ్చల్, మెదక్, సిద్దిపేట, సిరిసిల్లా, జగిత్యాల ప్రజలకు త్వరలోనే రైలు అందుబాటులోకి రాబోతుందని, ఈ మార్గం ద్వారా ప్రయాణ సౌకర్యాలు ఇంకా మెరుగవుతాయని తెలిపారు.
 
ఇప్పటికే నిజామాబాద్- జగిత్యాల రైల్వే మార్గం దాదాపు పూర్తి అయిందని, త్వరలోనే ఈ మార్గంలో రైలు ప్రయాణం ప్రారంభమవుతుందని ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పార్లమెంట్ సభ్యులు కొత్త ప్రభాకర్‌రెడ్డి, శాసనమండలి సభ్యులు పాతూరి సుధాకర్‌రెడ్డి, రైల్వే అధికారులు పాల్గొన్నారు.
 
మరిన్ని వార్తలు