13 మంది మావోయిస్టుల లొంగుబాటు

27 Feb, 2018 14:27 IST|Sakshi
లొంగిపోయిన 13 మంది మావోయిస్టులు

మల్కన్‌గిరి : మల్కన్‌గిరి జిల్లా సరిహద్దు రాష్ట్రం ఛత్తీస్‌గఢ్‌లోని సుకుమ జిల్లా ఎస్పీ అభిషేక్‌మిన్నా ఎదుట సోమవారం మధ్యాహ్నం 13మంది మావోయిస్టులు లొంగిపోయారు. వివరాలు ఇలా ఉన్నాయి.  దళంలో చిన్న చూపు చూస్తున్నారు. గిరిజనుల కోసమే పోరాటం అంటూనే వారి కోసం ప్రభుత్వం నిర్మిస్తున్న రోడ్డుపనులను అడ్డుకుంటున్నారు. అగ్రనేతలు ప్రాణాలు కాపాడడం కోసం చిన్న కేడర్‌ నేతలను ముందు ఉంచి బలి చేస్తూ వారు తప్పించుకుంటున్నారు. మహిళా మావోయిస్టులకు దళంలో రక్షణ కరువైంది. వారిపై లైంగిక దాడులు జరుగుతున్నాయి. అందుచేతనే తాము మనస్తాపం చెందిన లొంగిపోతున్నమని మావోయిస్టులు ఎస్పీకి తెలిపారు.

అలాగే తమ గిరిజనులపై ఇన్‌ఫార్మర్ల నెపం మోపి తమ చేతనే  హత్యలు చేయిస్తున్నారని ఆవేదన చెందారు. మాకు ఇవి నచ్చడం లేదు..ప్రజాసేవ చేయాలంటే జనజీవనంలోకి వచ్చి చేస్తామన్నారు. అనంతరం ఎస్పీ అభిషేక్‌మిన్నా మాట్లాడుతూ లొంగిపోయిన మావోయిస్టులకు ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను త్వరలోనే వారికి అందజేస్తామని తెలిపారు. లొంగిపోయిన మావోయిస్టులంతా దర్భ డివిజన్‌కు చెందినవారని తెలిపారు.


 

మరిన్ని వార్తలు