మస్త్ మజా మాడి..!

8 Jun, 2014 02:23 IST|Sakshi
మస్త్ మజా మాడి..!
  • బెంగళూరులో నైట్‌లైఫ్ షూరూ !
  •  ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ?
  •  ప్రభుత్వానికి నివేదిక ఇచ్చిన పోలీసు, ఎక్సైజ్
  •  సీఎంతో చర్చలు
  •  వచ్చే సంవత్సరం జూన్ వరకు చాన్స్
  •  బెంగళూరు, న్యూస్‌లైన్ :   నగర వాసులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ‘నైట్‌లైఫ్’ ఎంజాయ్‌మెంట్‌కు ప్రభుత్వం దాదాపు అంగీకరించింది. వారంలో రెండు రోజులు (శుక్ర, శనివారం) అర్ధరాత్రి 1 గంట వరకు బార్ అండ్ రెస్టారెంట్‌లలో సరదాగా గడపొచ్చని, 2015 జూన్ ఒకటి వరకు అభ్యంతరం లేదని పోలీసు అధికారులు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు.
     
    రెండు రోజుల క్రితం ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో రాష్ట్ర హోంశాఖ ప్రధాన కార్యదర్శి, డీజీపీ లాల్‌రుకుం పచావో, బెంగళూరు న గర పోలీసు కమిషనర్ రాఘవేంద్ర ఔరాద్కర్‌తో సహ సీనియర్ పోలీసు అధికారులు, ఎక్సైజ్‌శాఖ అధికారులు సమావేశమయ్యారు. మూడు నెలలుగా బెంగళూరులో ప్రయోగాత్మకంగా శుక్ర, శనివారాలలో అర్ధరాత్రి ఒంటి గంట వరకు బార్ అండ్ రెస్టారెంట్లు నిర్వహించడానికి అవకాశం కల్పించారు.

    ఆ సమయంలో ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కాలేదని పోలీసు అధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చారు. మూడు నెలల క్రితం ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలు ఈనెల 3వ తేదీకి పూర్తి అయ్యింది. ఈ నేపథ్యంలో సీఎంతో పోలీసు అధికారులు సమావేశమయ్యారు. ప్రయోగాత్మకంగా చేపట్టిన ఈ నైట్‌లైఫ్‌కు సంబంధించి ఎలాంటి సమస్యలు రాలేదని బెంగళూరు నగర పోలీసు కమిషనర్ రాఘవేంద్ర ఔరాద్కర్ చెప్పారు.
     
    పోలీస్ శాఖ నుంచి అభ్యంతరం లేదన్నారు. అయితే ఈ వారం నైట్‌లైఫ్ నగర ప్రజలకు అందుబాటులో ఉండదని, అందుకు అవసరమైన పోలీసు సిబ్బంది లేరని, సమస్యలు వస్తాయని సీనియర్ పోలీసు అధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. మొత్తానికి మస్త్ మజా కోసం నగర వాసులు ఉవ్విళ్లూరుతున్నారు.
     

మరిన్ని వార్తలు