డ్రై డేతో దోమలకు చెక్‌

9 Oct, 2016 11:41 IST|Sakshi
వైద్య ఆరోగ్యశాఖ అడిషనల్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ గీతా ప్రసాదిని 
 
సీతంపేట : వారానికి ఒకరోజు డ్రై డే పాటిస్తే డెంగ్యూ, మలేరియా జ్వరాలను వ్యాప్తి చేసే దోమల పెరుగుదలను నియంత్రించవచ్చని వైద్య ఆరోగ్యశాఖ అడిషనల్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ గీతా ప్రసాదిని అన్నారు. దోమ లార్వా పెరుగుదల నియంత్రణపై 13వ వార్డులో శనివారం అవగాహన ర్యాలీ నిర్వహించి కరపత్రాలు పంపిణీ చేశారు. సీతంపేట దుర్గాగణపతి ఆలయం వద్ద ఆమె ర్యాలీని ప్రారంభించారు.

గీతా ప్రసాదిని మాట్లాడుతూ మలేరియా, డెంగ్యూ జ్వరాలను వ్యాప్తి చేసే దోమలు నిల్వ ఉన్న మంచినీటిలోనే పెరుగుతాయన్నారు. కుండీలు, గోళాలు, మంచినీటి ట్యాంకులు, వారానికి ఒకసారి శుభ్రం చేసి ఆరబెట్టి నీరు పట్టుకోవాలని సూచించారు. డీఎంహెచ్‌వో సరోజిని మాట్లాడుతూ తీవ్రమైన జ్వరం, తలనొప్పి, వాంతులు, శరీరంపై దద్దుర్లు ఉంటే డెంగ్యూ జ్వరంగా అనుమానించి వైద్యుడిని సంప్రదించాలన్నారు. అన్ని ప్రభుత్వ , మున్సిపల్‌ డెస్పెన్సరీలలో డెంగ్యూ, మలేరియా జ్వరాలకు చికిత్స అందుబాటులో ఉందన్నారు. జీవీఎంసీ బయాలజిస్ట్‌ వై.మణి, జీవీఎంసీ సీనియర్‌ మెడికల్‌ ఆఫీసర్‌ సంజీవ్‌ కుమార్, మలేరియా ఇన్ స్పెక్టర్లు ఎం.వసంత్‌కుమార్, రామచంద్రరావు, రాంబాబు, ప్రకాశ్, జీవీఎంసీ, జిల్లా మలేరియా విభాగం సిబ్బంది పాల్గొన్నారు.  
 
 
మరిన్ని వార్తలు