వంతెనలకు ఎంజీఆర్, జయలలిత పేర్లు

6 May, 2017 02:10 IST|Sakshi
వంతెనలకు ఎంజీఆర్, జయలలిత పేర్లు

మదురైలో రెండు వంతెనలు ప్రారంభించిన ముఖ్యమంత్రి ఎడపాడి పళనిస్వామి

కేకేనగర్‌ : మదురైలో కొత్తగా నిర్మించిన రెండు వంతెనలను ఎంజీఆర్, జయలలిత పేర్లతో ముఖ్యమంత్రి ఎడపాడి పళనిస్వామి ప్రారంభించారు. మదురై వైగై నది మీదుగా రెండు ఫ్లైఓవర్‌ బ్రిడ్జిల నిర్మాణం 2014లో ప్రారంభమైంది. వీటి నిర్మాణం కోసం అప్పటి ముఖ్యమంత్రి జయలలిత రూ.30.47కోట్లను కేటాయించారు. అరబ్‌ పాలయం, అరుళ్‌ దాస్‌పురం, సెల్లూర్, తిరుముల్లై రాయర్‌ పట్టిదురై ప్రాంతాలను కలిపే విధంగా నదిపై వంతెన నిర్మాణం పూర్తయ్యింది.

ఆరబ్‌ పాళయం – అరుళ్‌దాస్‌ పురం వంతెనకు జయలలిత పేరు, సెల్లూర్‌ – తిరుమలైరాయర్‌ పట్టిదురై వంతెనకు ఎంజీఆర్‌ పేరు పెట్టారు. మదురైలో చిత్తిరై ఉత్సవాలు ప్రారంభమైన నేపథ్యంలో ట్రాఫిక్‌ రద్దీ తగ్గించే దిశగా ఈ కొత్త వంతెనలను ప్రారంభిచడానికి ప్రభుత్వం నిర్ణయించిందని, మదురైలో శుక్రవారం సాయంత్రం జరిగిన కార్యక్రమంలో వంతెనలను ప్రారంభించారు. అనంతరం రూ.22.25 కోట్ల విలువైన అభివృద్ధి పథకాలు, సంక్షేమ సహాయకాలను అందజేసి ప్రసంగించారు. విమానం ద్వారా ఆయన శుక్రవారం మధ్యాహ్నం మదురై చేరుకున్నారు. విమానాశ్రయంలో మంత్రులు ఆయనకు ఘన స్వాగతం పలికారు.

మరిన్ని వార్తలు