పొత్తుపై అధిష్టానానిదే తుది నిర్ణయం: కామినేని

24 May, 2017 15:36 IST|Sakshi
హైదరాబాద్‌: టీడీపీ, బీజేపీ పొత్తుపై కిందిస్థాయి నేతల్లో ఎవరు ఎన్ని మాట్లాడినా.. అధిష్టానానిదే తుది నిర్ణయమని ఏపీ మంత్రి కామినేని శ్రీనివాస్‌ అన్నారు. ఆయన బుధవారం విలేకరులతో మాట్లాడుతూ.. పొత్తుపై రెండు పార్టీల అధ్యక్షులు స్పష్టతతో ఉన్నారని చెప్పారు. 2019 వరకు బీజేపీ, టీడీపీ కలిసే ఉంటాయని అమిత్ షా స్పష్టం చేశారని తెలిపారు. పొత్తు విషయాలు పార్టీ అద్యక్షులు చూసుకుంటారని స్పష్టం చేశారు.
 
రేపు హైదరాబాద్‌ నుంచి అమిత్‌ షా, చంద్రబాబు కలిసి విజయవాడ చేరుకుంటారని తెలిపారు. సురేష్ ప్రభు ఎంపీ ల్యాడ్స్ నిధులతో  ఏర్పాటు చేసిన 13 అంబులెన్స్‌లను గురువారం అమిత్ షా ఫ్లాగ్ ఆఫ్ చేస్తారని తెలిపారు. ఉద్యోగుల బదిలీల్లో ఎటువంటి అవినీతి జరగలేదన్నారు.
మరిన్ని వార్తలు