అ‍త్యాచారం..హత్య : మైనర్‌ అరెస్ట్

23 Jan, 2017 11:39 IST|Sakshi
అ‍త్యాచారం..హత్య : మైనర్‌ అరెస్ట్

చెన్నై:  విల్లుపురం సమీపంలో ఇంట్లో ఒంటరిగా ఉన్న యువతిపై అత్యాచారం చేసి హత్య చేసిన ఘటనకు సంబంధించి కేసును పోలీసులు ఛేదించారు. తమిళనాడులోని విల్లుపురం సమీప ప్రాంతానికి చెందిన రైతు నటేషన్‌ (48)కు కుమార్తె జీవిత (18) ఉంది. సేలంలో ఉన్న ప్రైవేటు పాఠశాలలో నర్సింగ్‌ చేస్తోంది. సంక్రాంతి సెలవుల కోసం సొంతూరుకు వచ్చిన జీవిత 19వ తేదీన ఇంట్లో గాయాలతో అనుమానాస్పద రీతిలో మృతి చెందింది. దీనిపై విచారణ చేపట్టిన పోలీసులకు అదే ప్రాంతానికి చెందిన కేటరింగ్‌ కళాశాల విద్యార్థి, జీవితను హత్య చేసినట్టు తెలిసింది. దీంతో పోలీసులు అతన్ని అరెస్టు చేశారు.

 'జనవరి 19వ తేదీన జీవిత ఇంటికి వెళ్లాను. ఒంటరిగా ఉండడంతో ఆమెపై బలాత్కారం చేయడానికి ప్రయత్నించాను. అందుకు ఆమె తిరస్కరించడంతో గొంతును గట్టిగా పట్టుకున్నాను. అదే సమయంలో అమె స్పృహ తప్పి పడిపోయింది. ఆమెపై అత్యాచారం చేసి అక్కడి నుంచి పారిపోయా' అని పోలీసులకు ఇచ్చిన  వాంగ్మూలంలో విద్యార్థి పేర్కొన్నాడు. ఆ తర్వాత ఆమె మృతి చెందినట్టు తెలిసిందని నిందితుడు పోలీసులకు తెలిపాడు. అరెస్టు చేసిన బాలుడిని విల్లుపురం కోర్టులో హాజరు పరచి సెంజి జువైనల్‌ హోమ్‌కి తరలించారు.

Read latest State News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు