కూతురిపై తల్లి లైంగిక వేధింపులు

12 Oct, 2018 11:11 IST|Sakshi

సాక్షి ప్రతినిధి, చెన్నై: ఆడబిడ్డలకు అమ్మానాన్నలే అండ అంటారు. అయితే కన్నతండ్రులే కూతురిపై లైంగికదాడులకు పాల్పడుతున్న సంఘటనలు బయటపడ్డాయి. అయితే కన్నతల్లే కూతురి ద్వారా కామవాంఛ తీర్చుకునేందుకు ప్రయత్నించడం, కాదంటే హతమారుస్తానని బెదిరించిన సంఘటన చెన్నైలో చోటుచేసుకుంది. ఈ కేసులో బాధితురాలి తల్లిని, సహకరించిన అమ్మమ్మను పోలీసులు గురువారం అరెస్ట్‌ చేశారు. 

సభ్య సమాజం తలదించుకునే ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. చెన్నై తేనాంపేటకు చెందిన ఓ పారిశ్రామికవేత్త (45) రెండురోజుల క్రితం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అందులో.. ‘‘తొమ్మిదో తరగతి చదువుతున్న నా కుమార్తె (14)ను తన తల్లే లైంగిక వేధింపులకు గురిచేస్తోంది. లైంగిక సంబంధాలు పెట్టుకోకుంటే హతమారుస్తానని బెదిరిస్తోంది. ఇందుకు మా అత్తగారూ కూడా సహకరిస్తున్నారు. ఈ విషయాలను కుమార్తె ద్వారా విన్న నేను హతాశుడినై పోయాను. నా భార్య, అత్త మందలించినా వినలేదు.

 వారి వల్ల నా కుమార్తె ప్రాణాలకు ముప్పు ఉంది. నిందితులపై వెంటనే చర్య తీసుకోండి’’ అని ఫిర్యాదులో పేర్కొన్నాడు. పోక్సో చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేయగా ఫిర్యాది భార్య, అత్త ఇంటి నుంచి పారిపోయారు. తంజావూరు జిల్లా కుంభకోణంలో దాక్కుని ఉన్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు అక్కడి వెళ్లి ఫిర్యాది భార్య, అత్తను గురువారం అరెస్ట్‌ చేశారు. 
 

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

పిల్లలూ.. దుస్తులు ఇలా శుభ్రం చేసుకోవాలి

మహిళలకు ఉచిత బ్యాటరీ స్కూటర్లు

అమర జవాన్‌ కుటుంబానికి సుమలత సాయం

నువ్వు లేక నేను లేను అన్నాడు.. కానీ!

మిత్రుడిని రక్షించబోయి...

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

పాక్‌ గాయకుడిని తీసేసిన సల్మాన్‌

నాని విలన్‌గానా!

‘నిర్మాతలను ఇబ్బంది పెడుతున్న శంకర్‌’

‘గల్లీ బాయ్‌’ రీమేక్‌లో మెగా హీరో

‘విశ్వదర్శనం’ టీజర్‌ లాంచ్‌

శివకార్తికేయన్‌తో ‘హలో’ బ్యూటీ