వాటిని పెద్దగా పట్టించుకోను తనపై వస్తున్న విమర్శలపై

8 Jan, 2015 01:56 IST|Sakshi

స్పీకర్ కాగోడు తిమ్మప్ప సమాధానం

బెంగళూరు:ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారంటూ తనపై వస్తున్న విమర్శలపై ప్రతిస్పందించేందుకు స్పీకర్ కాగోడు తిమ్మప్ప నిరాకరించారు. అలాంటి విమర్శలను తాను పెద్దగా పట్టించుకోనని అన్నారు. అది ఓ ముగిసిపోయిన అధ్యాయమంటూ సమాధానమిచ్చారు. బుధవారమిక్కడ నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ...ప్రజాప్రభుత్వంలో ప్రతి ఒక్కరికీ తమ అభిప్రాయాలను తెలియజేసే అధికారం ఉందని అన్నారు. ఎవరి అభిప్రాయాలను వారు చెబుతూ ఉంటారని, అలాంటి వ్యాఖ్యలన్నింటిపై తాను స్పందించబోనని, అసలు పట్టించుకోనని తెలిపారు.

తాను ప్రతిపక్ష నేతగా వ్యవహరించడం లేదని, కేవలం ఒక స్పీకర్‌గా ఆ పదవికి మాత్రమే న్యాయం చేస్తున్నానని స్పష్టం చేశారు. కాగా, గత కొంతకాలంగా స్పీకర్ కాగోడు తిమ్మప్ప మంత్రుల పనితీరుపై బహిరంగ విమర్శలు చేస్తున్న నేపథ్యంలో ఆయనపై హైకమాండ్‌కు ఫిర్యాదు చేసేందుకు కొంతమంది మంత్రులు, ముఖ్యమంత్రి అనుయాయులు సిద్ధమయ్యారంటూ వార్తలు వెలువడిన విషయం తెలసిందే. ఈ ఘట్టానికి ముగింపు పలికేందుకే స్పీకర్ కాగోడు తిమ్మప్ప ‘అది ఓ ముగిసిపోయిన ఘట్టం’ అంటూ విలేకరులతో చెప్పారని తెలుస్తోంది.
 
 

మరిన్ని వార్తలు