పల్లెల్లోనూ బహుళ అంతస్తులు!

12 Aug, 2013 00:56 IST|Sakshi

సాక్షి, ముంబై: సింధుదుర్గ్, రత్నగిరి జిల్లాలు మినహా రాష్ట్రవ్యాప్తంగా గృహనిర్మాణాలపై ఒకే విధమైన చట్టం అమలు చేసేందుకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. దీంతో గ్రామీణ ప్రాంతా ల్లో కూడా 12 అంతస్తుల భవనాలు నిర్మించేం దుకు మార్గం సుగమమైంది. అదేవిధంగా కార్పొరేషన్ హద్దు బయట కూడా ఒకటిన్నర వరకు ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్ (ఎఫ్‌ఎస్‌ఐ) లభిం చే అవకాశాలున్నాయి. దీంతో నగరం బయట కూడా ఎక్కువ ఇళ్లు లభించనున్నాయి. దీని ద్వారా ఆకాశాన్నంటిన ఇళ్ల ధరలు అదుపులోకి వస్తాయి. ఈ నియమాలకు సంబంధించిన ప్రతిపాదన గత ఏడాదిన్నర నుంచి పెండిం గులో ఉంది. ప్రస్తుతం కార్పొరేషన్ పరిధిలో, కార్పొరేషన్ హద్దు నుంచి 10 కి.మీ. దూరం వరకు 12 అంతస్తుల భవనాలు నిర్మించేందు కు అనుమతి ఉంది. 10 కి.మీ. దూరం తర్వాత నిర్మాణ పనులపై ఆంక్షలు ఉండేవి.
 
 ఇకనుంచి చట్టంలో మార్పులు చేయడం వల్ల మున్సిపాలిటీల హద్దులో కూడా 12, ఆపై అంతస్తుల భవనాలు నిర్మించేందుకు మార్గం సుగమమైం ది. ఇదివరకు కార్పొరేషన్‌లో కూడా నియమా లు వేర్వేరుగా ఉండేవి. ఇక నుంచి సింధుదుర్గ్, రత్నగిరి రెండు జిల్లాలు మినహా రాష్ట్రవ్యాప్తంగా ఒకే విధంగా నియమాలు అమలులోకి వచ్చాయి. మున్సిపాలిటీ, గ్రామీణ ప్రాంతాల్లో కేవలం నాలుగు అంతస్తుల భవనాలు నిర్మించేందుకు అనుమతి మాత్రమే ఉండేది. ఇకనుంచి గ్రామీణ ప్రాంతాల్లో 12 అంతస్తుల భవనాలు నిర్మించేందుకు అనుమతి లభించనుంది. అందుకు అగ్నిమాపక శాఖ నుంచి నో అబ్జక్షన్ సర్టిఫికెట్ (ఎన్‌ఓసీ) తప్పనిసరి తీసుకోవాల్సి ఉంటుంది. ఒకటిన్నర వరకు ఎఫ్‌ఎస్‌ఐ లభించడంతో ప్రీమియం భరిస్తే కొత్తగా నిర్మించే అపార్టుమెంట్లలో ఇక నుంచి బాల్కని, మెట్లు, టెర్రెస్ లభించనున్నాయి. కాగా సింధుదుర్గ్, రత్నగిరి జిల్లాలు పర్యావరణ దృష్ట్యా అత్యంత సమస్మాత్మకంగా ఉండడంవల్ల ఇక్కడ కొత్త నియమాలు అమలుచేయలేదని అధికారులు వెల్లడించారు.

మరిన్ని వార్తలు