నరేంద్ర మోడీతోనే దేశాభివృద్ధి

12 Apr, 2014 03:12 IST|Sakshi
నరేంద్ర మోడీతోనే దేశాభివృద్ధి

సినీ నటి రక్షిత
 

కోలారు, న్యూస్‌లైన్ :నరేంద్రమోడీతోనే దేశాభివృద్ధి సాధ్యమని, ఆయనను ప్రధానిని చేసేందుకు కోలారు లోక్‌సభ బీజేపీ అభ్యర్థి నారాయణస్వామిని అఖండ మెజార్టీతో గెలిపించాలని సినీ నటి రక్షిత ఓటర్లకు పిలుపు ఇచ్చారు.శుక్రవారం ఆమె  నరసాపురం, సూలూరు, వేమగల్‌లలో అభ్యర్థితో కలిసి రోడ్‌షో ద్వారా ప్రచారం నిర్వహించారు.

మోడీ గుజరాత్‌ను ఎంతో అభివృద్ధి చేశారని, ఆయనను ప్రధానిగా చూడాలని దేశప్రజలు కలలు కంటున్నారన్నారు. కోలారులో ఎలాంటి అభివృద్ధి జరగలేదని, బీజేపీ అభ్యర్థిని గెలిపించడం ద్వారా నియోజకవర్గంలో అభివృద్ధికి  పనులకు శ్రీకారం చుట్టాలన్నారు. అభ్యర్థి మాట్లాడుతూ ఆరు పర్యాయాలు ఎంపీగా పదవిని అలంకరించిన కేహెచ్ మునియప్ప నియోజకవర్గ అభివృద్ధికి  చేసిందేమి లేదన్నారు.

తనను ఎంపిగా గెలిపిస్తే సమస్యల పరిష్కారం కోసం ప్రామాణిక ప్రయత్నం చేస్తామన్నారు.  
 వేడిమిని తాళలేని రక్షిత :    సినీనటి రక్షిత  భానుడి ప్రతాపానికి తాళలేక పోయింది. నరసాపురం. సూలురు గ్రామాలలో నీడ ఉన్న చోటుకు వెళ్లి ప్రసంగాలు ఇచ్చారు.

 

మరిన్ని వార్తలు