మర్ జవాన్...మర్ కిశాన్

30 Mar, 2014 22:55 IST|Sakshi

 నాందేడ్, న్యూస్‌లైన్:  పత్తి ఎగుమతులపై కేంద్రం నిషేధం విధించడం విదర్భ రైతుకు శపంగా పరిణమించిందని బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ ఆరోపించారు. యూపీఏ సర్కార్ తీసుకున్న విధాన నిర్ణయాల వల్ల లాల్ బహుదూర్ శాస్త్రి నినాదమైన జై జవాన్ జై కిసాన్ కాస్తా మర్ జవాన్, మర్ కిశాన్‌గా మారిందని అకోలాలో ఆదివారం జరిగిన ఎన్నికల ప్రచారంలో మోడీ మండిపడ్డారు. రానున్న ఎన్నికల్లో వారి నినాదం ఇదేనని చమత్కరించా రు.

విదర్భ కన్నా గుజరాత్‌లో అనేక మంది రైతులు ఉన్నారని, అయితే ఇక్కడి వారి మాదిరిగా అక్కడ ఆత్మహత్యలు చేసుకోవడం లేదన్నారు. ఉత్పాదక నాణ్య త పెరిగేలా కేంద్రం ఏమీ చర్య లు తీసుకోవడం లేదని, అందుకే విదర్భలో రైతుల ఆత్మహత్యలు పెరిగాయని చెప్పారు. అకోలాలో వ్యవసాయ విశ్వ విద్యాలయమున్నా స్థానిక రైతులకు ఉపయోగపడం లేదన్నారు. రైతులను కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శరద్ పవార్, కాంగ్రెస్ వంచి స్తోందని మండిపడ్డారు.

 మాజీ సీఎం అశోక్ చవాన్‌కు టికెటివ్వడమేంటి?
 ‘ఆదర్శ్ సొసైటీ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ ముఖ్యమంత్రి అశోక్ చవాన్ అభ్యర్థిత్వంపై నేను ప్రశ్నిం చినప్పుడు, సమగ్ర దర్యాప్తు చేసి ఆయనపై తప్పకుండా చర్యలు తీసుకుంటామని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఢిల్లీలో విలేకరుల సమావేశంలో హామీ ఇచ్చారు. చర్యలు తీసుకోవడమంటే ఎన్నికల్లో పోటీచేసేందుకు టికెట్ ఇవ్వడమా..? అ’ని మోడీ ఎద్దేవా చేశారు. నాందేడ్ లోక్‌సభ నియోజకవర్గం బీజేపీ, శివసేన, ఆర్పీఐ (ఆఠవలే వర్గం) మహా కూటమి అభ్యర్థి డీబీ పాటిల్‌కు మద్దతుగా ఆదివారం నిర్వహించిన ప్రచారసభకు మోడీ హాజరయ్యారు.

 నాందేడ్‌లోని శ్రీ గురుగోవింద్ సింగ్ స్టేడియంలో ఏర్పాటుచేసిన ప్రచార సభకు సుమారు లక్షన్నరకుపైగా జనం వచ్చారు. ఈ సందర్భంగా భారీ జనానుద్ధేశించి మోడీ మాట్లాడుతూ... దేశంలో కాంగ్రెస్‌కు నూక లు చెల్లాయని, మే 16వ తేదీ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆఖరు రోజ న్నారు. కార్గిల్ యుద్ధంలో తమ భర్తలను పొగొట్టుకున్న వితంతువులకు తీరని అన్యాయం చేశారని దుయ్యబట్టారు. మన సంస్కృతిలో సోదరికి ఇవ్వడమే తప్ప వారి నుంచి పుచ్చుకునే సంప్రదా యం లేదని, అయితే ఓ సోదరుడు సోదరి ఇంటి టికెట్‌నే కాజేశారని చవాన్ ఉద్ధేశించి పరోక్షంగా విమర్శించారు. శ్రీగురుగోవింద్ సింగ్ పుట్టిన ఈ నాందే డ్ గడ్డమీద ఒట్టేసి చెబుతున్న కొత్త ప్రభుత్వం ఏర్పాటు కాగానే, అవినీతి కుంభకోణంలో చిక్కుకున్న వారిని చట్టపరంగా శిక్షించి తీరుతామని, వారి ని వదిలే ప్రసక్తి లేదన్నారు. పెరిగిన నిత్యావసర సరుకుల ధరలతో పేదలు బేజారైపోయారని, ఎక్క డ చూసిన కాంగ్రెస్ నాయకుల అవినీతి భాగోతాలే వెలుగులోకి వస్తున్నాయన్నారు.

అవినీతిలో కూరుకుపోయిన కాం గ్రెస్‌కు గుణపాఠం చెప్పాలంటే అధికారంలోంచి గద్దె దింపడమే ప్రత్యామ్నా య మార్గమని ప్రజలకు మోడీ పిలుపునిచ్చారు. అనంతరం బీజేపీ నాయకుడు గోపీనాథ్ ముండే మాట్లాడుతూ...అశోక్ చవాన్ పరాజయం తథ్యమని జోస్యం చెప్పారు. అకాల వర్షాల వల్ల తీవ్రం గా నష్టపోయిన రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని దుయ్యబట్టారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే రైతులను అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు.

 వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో దాదాపు 40 లోక్‌సభ స్థానాల్లో గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. అనంతరం ఆర్పీఐ అధ్యక్షుడు రాందాస్ అథవలే, బీజేపీ ప్రదేశ్ అధ్యక్షుడు దేవేంద్ర ఫడ్నవీస్, అభ్యర్థి డి.బి.పాటిల్ తదితరు లు మాట్లాడుతూ కాంగ్రెస్ గుణపాఠం చెప్పి, మహా కూటమికి అధికారం అప్పగించాలని అన్నారు. పాటిల్‌ను గెలిపించేందుకు నడుం బిగించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ సభలో మహాకూటమి నాయకులు, ఎమ్మెల్యేలు, పదాధికారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

 ఈ ఎన్నికలు శివసేనకు సవాల్: ఉద్ధవ్‌ఠాక్రే
 ముంబై: తన తండ్రి బాల్‌ఠాక్రే మరణం తర్వాత తొలిసారిగా జరుగుతున్న ఈ ఎన్నికలు తమ పార్టీకి సవాల్ అని శివసేన పార్టీ అధ్యక్షుడు ఉద్ధవ్‌ఠాక్రే స్పష్టం చేశారు. ఇప్పటికీ బాల్‌ఠాక్రే సమక్షంలోనే పార్టీ నడుస్తుందన్న భావన కలుగుతోందని ఆదివా రం సామ్నా సంపాదకీయంలో పేర్కొన్నారు. కొంత మంది నాయకులే పార్టీ వీడుతున్నారే తప్ప క్యాడర్ అంతా తమతోనే ఉందన్నారు. టికెట్లు నిరాకరించడంతో కొంత మంది బయటకు వెళుతున్నారని చచెప్పారు. అక్రమాస్తుల కేసులో శివసేన పార్టీ నాయకుడు బాబన్‌రావ్ గోలప్‌కు శిక్ష పడటంపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. 14 ఏళ్ల తర్వాత కూడా, అది కూడా ఎన్నికల సమయంలో తీర్పు రావడం ఏంటోనని అన్నారు. కాగా, దేశవ్యాప్తంగా బీజేపీ నేతృత్వం లోని నేషనల్ డెమోక్రటిక్ అలయెన్స్ (ఎన్‌డీఏ) అనుకూల పవనాలు వీస్తున్నాయన్నారు. త్వరలోనే ఇది కాషాయ తుఫానుగా మారుతుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు.  

 కాంగ్రెస్‌కు బలమైన నాయకత్వం లోపించిం దని, బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేం ద్ర మోడీని ప్రత్యమ్నాయంగా ప్రజలు భావిస్తున్నారని పేర్కొన్నారు.  అటల్ బీహారి వాజ్‌పేయి మినహా మిగతా ఏ నాయకుల గురించి బీజేపీ ప్రచారంలో పేర్కొనడం లేదని, అదే కాంగ్రెస్ నెహ్రూ, ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ పేర్లు వాడుకుంటున్నా రాహుల్ గాంధీ, అదే సమయంలో ప్రియాంక వాద్రాను ప్రజల ముందు కు తేవడంలో విఫలమైం దన్నారు. ప్రతిపక్ష పార్టీలన్నీ నరేంద్ర మోడీకి సంపూర్ణ మద్దతును ప్రకటించాయని తెలిపారు.

మరిన్ని వార్తలు