ఘనంగా విజయ్ దివస్

26 Jul, 2014 23:42 IST|Sakshi
ఘనంగా విజయ్ దివస్

సాక్షి, చెన్నై :పాక్ సైన్యం 1999లో కాశ్మీర్‌ను ఆక్రమించుకోవడానికి భారత్‌లోకి చొరబడిన విషయం తెలిసిందే. ఈ చర్యలను తిప్పికొట్టడమే లక్ష్యంగా భారత సైన్యం వీరోచితంగా శ్రమించింది. కార్గిల్ గుండా దేశంలోకి చొరబడ్డ పాక్ శక్తుల్ని అదే మార్గం గుండా తరిమి కొట్టేందుకు రెండు నెలల పాటుగా యుద్ధం చేయాల్సి వచ్చింది. ఈ కార్గిల్ యుద్ధంలో మన సైనికులు 527మంది అమరులయ్యారు. 1863 మంది గాయపడ్డారు. ఇందులో రాష్ట్రానికి చెందిన వీర జవాన్లు కూడా ఉన్నారు. జూలై 26న ఈ యుద్ధంలో భారత్ విజయ కేతనం ఎగుర వేసింది. నాటి నుంచి కార్గిల్ విజయ్ దివస్‌ను జరుపుకుంటూ వస్తున్నారు. ఇందులో భాగంగా శనివారం ఉదయం మెరీనా తీరంలోని వార్ మెమోరియల్ స్థూపాన్ని సుందరంగా తీర్చిదిద్దారు. పలు రకాల పుష్పాలతో తీర్చిదిద్దిన ఈ స్థూపం వద్ద భారత ఆర్మీ, నావికాదళం అధికారులు, సిబ్బంది ఘన నివాళులర్పించారు.  తమిళనాడు, ఆంధ్రా, క ర్ణాటక, కేరళ హెడ్ క్వార్టర్ జనరల్ ఆఫీసర్ కమాం డింగ్ లె ఫ్టినెంట్ జనరల్ జగ్బీర్ సింగ్, తమిళనాడు, పుదుచ్చేరి నావల్ ఆఫీసర్ ఇన్‌చార్జ్ కె మహదేవన్ ఆ స్తూపం వద్ద పుష్ప గుచ్ఛాలను ఉంచి వీర వందనం సమర్పించారు.
 

మరిన్ని వార్తలు