రాజ్యసభకు నవనీతకృష్ణన్

14 Jun, 2014 04:14 IST|Sakshi
రాజ్యసభకు నవనీతకృష్ణన్

- అన్నాడీఎంకే అధినేత్రి జయ ప్రకటన
- జూలై 3న ఎంపిక
తమిళనాడు పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎన్‌పీఎస్‌సీ) చైర్మన్‌గా ఉన్న నవనీతకృష్ణన్ అన్నాడీఎంకే తరపున రాజ్యసభ అభ్యర్థిగా ఎంపికయ్యూరు. ఈ మేరకు ఆ పార్టీ అధినేత్రి, సీఎం జయలలిత ఆయన పేరును గురువారం రాత్రి ప్రకటించారు.  

చెన్నై, సాక్షి ప్రతినిధి : మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి ఇటీవల మృతిచెందిన విష యం తెల్సిందే. దీంతో రాజ్యసభకు సంబంధించి ఆంధ్రప్రదేశ్‌లో ఒక స్థానం ఖాళీ అరుు్యంది. డీఎంకే రాజ్యసభ సభ్యు లు సెల్వగణపతి అవినీతి ఆరోపణల కారణంగా శిక్ష పడడంతో ఆయన రాజీనామా చేశారు. ఈనేపథ్యంలో తమిళనాడులో ఒక స్థానం ఖాళీ ఏర్పడింది. ఒడిస్సాకు చెందిన శశిభూషణ్ బేర్, రబీనారాయణ మహాపాత్ర స్థానాలు ఖాళీ అయ్యూరు. ఈ నాలుగు స్థానాలకు ఎన్నికలు అనివార్యమయ్యూరు. రాష్ట్ర అసెంబ్లీలో మొత్తం 234 స్థానాలు ఉండగా, 118 ఓట్లు దక్కించుకున్నవారే రాజ్యసభకు ఎంపికవుతారు.

అన్నాడీఎంకేకు 153 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. 7 మంది డీఎండీకే రెబల్ ఎమ్మెల్యేలు అన్నాడీఎంకేకు మద్దతు పలుకుతున్నారు. అసెంబ్లీలో సంఖ్యాబలం ప్రాతిపదికన అన్నాడీఎంకే అభ్యర్థి గెలుపు ఏకగ్రీవమైనట్లే. రాజ్యసభకు రాజీనామా చేసిన సెల్వగణపతికి 2016 జూన్ 29 వతేదీ వరకు గడువు ఉంది. అప్పటి వరకు నవనీతకృష్ణన్ రాజ్యసభ సభ్యునిగా కొనసాగుతారు. ఇదిలా ఉండగా రాజ్యసభ ఎన్నికల కోసం ఈనెల 16 నుంచి 23వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. 24వ తేదీన పరిశీలన, 26వ తేదీన ఉపసంహరణ పూర్తిచేసి జూలై 3న పోలింగ్ నిర్వహిస్తారు. అదే రోజు సాయంత్రం లెక్కింపు నిర్వహించి విజేత పేరును ప్రకటిస్తారు. ప్రస్తుతం రాజ్యసభలో అన్నాడీఎంకేకు 10 మంది సభ్యులుండగా, నవనీత కృష్ణన్ గెలుపుతో ఆ బలం 11కు పెరగనుంది.
 

మరిన్ని వార్తలు