ఎన్సీపీ ఎన్నికల భేరి

5 Jan, 2014 23:21 IST|Sakshi

సాక్షి, ముంబై: రాష్ట్రంలో ఎన్నికల నగారా ఇంకా మోగనే లేదు. అప్పుడే నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) ఎన్నికల శంఖం పూరించింది. వచ్చే లోక్‌సభ ఎన్నికలకు సమాయత్తమయ్యేందుకు ఆదివా రం ముంబైలోని యశ్వంత్‌రావ్ చవాన్ అడిటోరియంలో ఆ పార్టీ అధినేత శరద్‌పవార్ రాష్ట్ర నాయకులతో సమావేశం ఏర్పాటు చేశారు. పార్టీని విజ యబాటలో నడిపించడానికి, ప్రత్యర్థులను ఓడిం చేందుకు అవసరమైన వ్యూహప్రతివ్యూహాల పై పవార్ చర్చించారు. ఈ సమావేశంలో ఎన్సీపీ ప్రదే శ్ రాష్ట్ర అధ్యక్షుడు భాస్కర్‌రావ్ జాదవ్, కార్యాధ్యక్షుడు జితేంద్ర అవాడ్, ఉప-ముఖ్యమంత్రి అజిత్ పవార్, ఆ పార్టీ మంత్రులు, అన్ని విభాగాల ప్రముఖులు, కార్యకర్తలు హాజరయ్యారు. ఈ సందర్భం గా పవార్ మాట్లాడుతూ మరాఠాల రిజర్వేషన్ ప్రధానాంశంగా ఎన్నికల్లో పోరాడుతామని పేర్కొన్నారు.  
 
 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై మాట్లాడుతూ అక్కడ ఎప్పుడు అసెంబ్లీ ఎన్నికలు జరిగి నా, ఫలితాలు ఆశ్చర్యం కలిగించేలా ఉంటాయని చెప్పారు. ఎన్సీపీ నాయకులు ఢిల్లీ ఫలితాలపై ఆం దోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. దేశవ్యాప్త సరళికి మహారాష్ట్ర ఎన్నికలు విభిన్నంగా ఉంటాయని పవార్ అన్నారు. ‘మన పార్టీ అభ్యర్థులు జిల్లా పరిషత్, గ్రామ పంచాయతీ, ఇతర స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయఢంకా మోగిస్తున్నా రు. శాసనసభ ఎన్నికల్లోనూ మన అభ్యర్థులు గెలుస్తున్నా మన ఎంపీ అభ్యర్థులు పరాజయం పాలవుతున్నారు. ఈ విషయాన్ని మనం తీవ్రంగా పరిగణించాలి. యువ ఓటర్ల సంఖ్య గణనీయంగా పెరిగింది. వీరిని ఆకట్టుకోవాలంటే ఫేస్‌బుక్, ట్విటర్ వంటి సోషల్ మీడియాను సద్వినియోగం చేసుకోవాలి’ అని సూచించారు. భాస్కర్‌రావ్ జాదవ్ ప్రసంగిస్తూ ప్రజలతో సత్సంబంధాలు మెరుగుపర్చుకోవాలని కార్యకర్తలకు సూచించారు. టికెట్లు ఆశించడానికి ముందు పార్టీ అభివృద్ధి కోసం పాటుపడాలని హితవు పలికారు.
 
 మీడియాపై మండిపడ్డ అజిత్ పవార్
 అజిత్ పవార్ మాట్లాడుతూ విభేదాలను పక్కన బెట్టి వచ్చే ఎన్నికల్లో పార్టీని విజయబాటలో ఎలా నడిపించాలో ఆలోచించాలని యువ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఐకమత్యంతో పోరాడితే సాధించలేనిది ఏది లేద న్నారు. ‘మీడియా ఆదర్శ్ కుంభకోణంపై ఇష్టమున్నట్లు కథనాలను ప్రసారం చేస్తోంది. ఇందులో మన పార్టీ మంత్రు ల పేర్లు వెలుగులోకి వచ్చాయి. ఇదంతా ఎన్సీపీ ప్రతిష్ట చెడగొట్టేం దుకు చేస్తున్న కుట్ర. ఇలాంటి బూటకపు వార్తలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. ఆదర్శ్ తో మన పార్టీ మంత్రులకు ఎలాం టి సంబంధం లేదు’ అని వివరించారు. ఎన్నికల్లో పార్టీ కోసం పనిచేసే కొత్త ముఖాలకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు వెల్లడించారు. మహిళా కార్యకర్తలను ఉత్తేజపర్చడానికి ఇదివరకే సుప్రియసులే పలు శిబిరాలు ఏర్పాటుచేశారని గుర్తుచేశారు. హోం మంత్రి ఆర్.ఆర్.పాటిల్ ప్రజల భద్రతకు పెద్ద పీటవేసిన విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని అజిత్ పిలుపునిచ్చారు. ఛగన్ భుజబల్ మాట్లాడుతూ ‘పవార్ ప్రవేశపెట్టిన అభివృద్ధి పథకాలు ఇతర పార్టీలకు ప్రయోజనం చేకూర్చుతున్నాయి.
 
 ఫలితంగా ఎన్నికల్లో ఫలితాలు సానుకూలం గా రావడం లేదు. ఈ పథకాలను ప్రజలకు మనం వివరించాలి’ అని కార్యకర్తలకు మార్గదర్శనం చేశారు. పాటిల్ మాట్లాడుతూ పార్టీ నాయకులు చేసిన ప్రసంగాలను సమర్థించారు. రాష్ట్రంలో ఎన్సీపీకి ఎలాంటి దిగులూ అవసరం లేదన్నారు. ఇదివరకు కేవలం అభివృద్ధినే అజెండాగా పెట్టుకుని ఎన్నికల ముందుకు వెళ్లామని, ఇప్పుడు ధరల పెరుగుదల, అవినీతి అంశాలతో ఎన్నికల ముందుకు వెళ్లాల్సి వస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. పార్టీలో క్రమశిక్షణ పాటించని వారికి మరోసారి అవకాశం ఇవ్వబోమని హెచ్చరించారు. లోక్‌సభ ఎన్నికల బాధ్యతలను ప్రాంతాల వారీగా అప్పగించారు. మరఠ్వాడా ప్రాంతానికి జయదత్ క్షీర్‌సాగర్, పశ్చిమ మహారాష్ట్రకు హసన్ ముశ్రీఫ్, రామ్‌రాజే నిం బాల్కర్‌ను, కొంకణ్ ప్రాంతానికి గణేశ్ నాయిక్, సునీల్ తట్కరేను నియమిం చారు. ఉత్తర మహారాష్ట్రలో ఎన్నికల నిర్వహణ బాధ్యతను ఛగన్ భుజబల్‌కు అప్పగించారు.

మరిన్ని వార్తలు