ఢిల్లీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ‘శక్తి’ క్యాబ్‌లు

16 Mar, 2015 00:47 IST|Sakshi

న్యూఢిల్లీ: నగర మహిళకు భద్రత కల్పించాలని  న్యూఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్(ఎన్‌డీఎంసీ) భావిస్తోంది. వారిపై మహిళలపై బస్సులు, ట్యాక్సీల్లో దాడులు పెరుగుతుండడంతో మహిళా ట్యాక్సీలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ప్రపంచ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ‘శక్తి’ పేరుతో 20 ట్యాక్సీలను ప్రారంభించాలని స్థానిక సంస్థ ఏర్పాట్లు చేసుకుంది. కానీ ఎన్‌డీఎంసీ కొన్ని కారణాలతో ఆ కార్యక్రమాన్ని వాయిదా వేసుకుంది. దీనిపై ఎన్‌ఎండీసీ చైర్‌పర్సన్ జలాజ్ శ్రీవాస్తవ మాట్లాడుతూ తాము ఇంకా రవాణా శాఖను సంప్రదించాల్సి ఉందని, ఇలాంటి సేవలను ప్రారంభించాలంటే మొదట 100 ట్యాక్సీల ఏర్పాటు చేయాల్సి ఉందని తెలిపారు. కానీ నిధులలేమి కారణంగా పైలట్ ప్రాజెక్ట్‌గా కేవలం 20 ట్యాక్సీలతో ప్రారంభించాలని నిర్ణయించినట్టు ఆమె వెల్లడించారు. ఈ సేవలను వ చ్చే నెల నుంచి ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. కాగా, ఈ ట్యాక్సీలకు మహిళలే డ్రైవ ర్లుగా ఉంటారని పేర్కొన్నారు. చిన్న పిల్లలు సులువుగా నేరగాళ్ల బారిన పడుతుండడంతో కార్పొరేషన్ పరిధిలో నడిచే అన్ని పాఠశాలల బస్సుల్లోనూ మహిళా డ్రైవర్లనే నియమించేందుకు యత్నిస్తున్నట్టు తెలిపారు.

మరిన్ని వార్తలు