మరో రోజూ కావాలి

5 Aug, 2013 00:22 IST|Sakshi

 సాక్షి, ముంబై: గణేశ్ ఉత్సవాల సమయంలో అర్ధరాత్రి వరకు లౌడ్‌స్పీకర్లు, బ్యాండ్‌మేళాలు, టపాసులు వినియోగించేందుకు నాలుగు రోజులపాటు అనుమతిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. అయి తే లౌడ్‌స్పీకర్ల సౌండ్‌లో మాత్రం ఎలాంటి మార్పూ చేయలేదు. నియమాలకు లోబడి నిర్దేశించిన స్థాయుల ప్రకారమే సౌండ్ సిస్టంను వాడాల్సి ఉం టుంది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ముంబై సార్వజనిక గణేశ్ ఉత్సవ మండళ్లు హర్షం వ్యక్తం చేశాయి. ఉత్సవాల కోసం ఒక రోజు అదనంగా.. అంటే ఐదు రోజులపాటు అర్ధరాత్రి వరకు లౌడ్‌స్పీక ర్లు, బాణసంచా, బ్యాండ్, భజనలు, కీర్తనలు ఆల పించేందుకు అనుమతివ్వాలని సార్వజనిక గణేశ్ ఉత్సవ మండళ్లు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాయి. గతంలో మూడు రోజుల వరకు అనుమతి ఉండగా ఈసారి నాలుగు రోజులకు పెంచారు. అయితే లౌడ్‌స్పీకర్ సౌండ్‌ను మాత్రం తగ్గించాలని ప్రభుత్వం షరతులు విధించింది.
 
 దీంతో మండళ్ల నిర్వాహకులు నియమాలకు లోబడి అర్ధరాత్రిలోపు లౌడ్‌స్పీకర్ల వినియోగాన్ని నిలిపివేయాల్సి ఉంటుంది. ఉత్సవాలు మినహా మిగతా రోజుల్లో రాత్రి 10 గంటల నుంచి ఉదయం ఆరు గంటల వరకు లౌడ్‌స్పీకర్ల వినియోగాన్ని ప్రభుత్వం పూర్తిగా నిషేధించిన విషయం తెలి సిందే. కాగా ధ్వని కాలుష్యం నియంత్రణకు కట్టుబడి ఏటా 15 రోజులు మాత్రమే అర్ధరాత్రి వరకు లౌడ్‌స్పీకర్లు వినియోగించుకోవడానికి ప్రభుత్వం అధికారికంగా అనుమతి ఇచ్చింది. గణేశ్ ఉత్సవాల సమయంలో ఐదోరోజు విగ్రహాల నిమజ్జనం, గౌరీవిగ్రహాల నిమజ్జనం, అనంత చతుర్థి ఇలా మూడు రోజులు మాత్రం అర్ధరాత్రి వరకు లౌడ్‌స్పీకర్లకు అనుమతి ఉండేది. ఈసారి అదనంగా మరోరోజు అనుమతి లభించింది.
 
 ఏటా శివాజీ జయంతి, ఈద్-ఏ-మిలాద్, అంబేద్కర్ జయంతి, మహారాష్ట్ర అవతరణ దినోత్సవం, దీపావళి, క్రిస్మస్, 31 డిసెంబర్, గణేశ్ ఉత్సవాల్లో నాలుగు రోజులు, నవరాత్రి ఉత్సవాల్లో  13 రోజులు అర్ధరాత్రి వరకు లౌడ్‌స్పీకర్లు వినియోగించేందుకు అనుమతి ఉంటుంది. అవసరమైతే మరో రెండు రోజులు పొడగించడానికి జిల్లా అధికారులకు అధికారాలు ఉంటాయి. గణేశ్ ఉత్సవాల కోసం ఐదు రోజుల పాటు సంగీత పరికరాలకు అనుమతించాలని బృహన్‌ముంబై సార్వజనిక గణేశ్ ఉత్సవ సమన్వయ సమితి అధ్యక్షుడు నరేశ్ దహిబావ్కర్ జిల్లా అధికారికి విజ్ఞప్తి చేశారు. ఒకవేళ ఇక్కడి నుంచి అనుమతి లభిస్తే మొత్తం ఐదు రోజు లు గణేశ్ ఉత్సవాలను భారీ ఆటపాటలతో నిర్వహించుకోవచ్చు.

Read latest State News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు