నేతాజీ విమాన ప్రమాదంలో మరణించలేదా?

24 Jul, 2016 02:03 IST|Sakshi
నేతాజీ విమాన ప్రమాదంలో మరణించలేదా?

టీనగర్: నేతాజీ సుభా్‌ష్ చంద్రబోస్ విమాన ప్రమాదంలో మరణించలేదని తిరుచ్చిలో ఐఎన్‌ఏ సైనికుడు ఒకరు చేసిన వ్యాఖ్యలు కొత్త చర్చకు దారితీశాయి. తిరుచ్చి జోసెఫ్ కళాశాల చరిత్ర విభాగం ఆధ్వర్యంలో మండ్రం ప్రారంభోత్సవం శుక్రవారం జరిగింది. నేతా జీ ఇండియన్ నేషనల్ ఆర్మీ (ఐఎన్‌ఏ) దళంలోని సైనికుడు దురైరాజ్ (96) కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ మలేసియాలో నేతాజీ ఐఎన్‌ఏ కోసం అభ్యర్థులను సేకరించారని, ఆ యన ప్రసంగానికి ఆకర్షితుడినై తనతో సమా 180 మం ది ఐఎన్‌ఏలో చేరామని తెలిపారు. మలేసియాలోని రెం డవ బెటాలియన్‌లో 20 వేల మంది ఉన్నామని..

ఇక్కడ నుంచి ఒక బెటాలియన్ ఇంఫాల్ (బర్మా)కు పంపారన్నా రు. ఐఎన్‌ఏ దళం మణిపూర్ సమీపంలోని కోహిమా అనే నగరాన్ని స్వాధీనం చేసుకుందన్నారు. తానున్న బెటాలి యన్ మలేసియాలో వుందని.. ఆ సమయంలో ఆంగ్లేయు లు ఆకాశ దాడులను ముమ్మరం చేశారన్నారు. ఈ దాడుల్లో కోహిమా అడవుల్లోని ఒక బెటాలియన్ చిక్కుకోగా అందు లో అనేక మంది చనిపోయారని తెలిపారు. దళాధిపతి షానవాజ్, బిల్లన్ అరెస్టయినట్లు పేర్కొన్నారు. ఈ క్రమంలో హిరోషిమా అణుబాంబు దాడులు జరిగాయన్నారు. జపాన్ అమెరికాకు లొంగిపోయే ముందు నేతాజీని కాపాడాలనే ఉద్దేశంతో జపనీయులు నేతాజీ తప్పించుకునేలా చేశారన్నారు.

దీంతోపాటు విమానంలో వెళ్లే సమయంలో మృతిచెందినట్లు నమోదు చేశారన్నారు. మలేసియాలోని రెండవ బెటాలియన్ లో తాను పనిచేస్తుండగా తైపే (తైవాన్)లో ఆ విమాన ప్రమా దం జరిగిందని, ప్రమాదంలో నేతాజీ ఉన్నట్లయితే 60 మైళ్ల దూరంలో పనిచేస్తున్న తమ దళానికి వెంటనే సమాచారం తెలి యజేసేవారని చెప్పారు. తద్వారా నేతాజీ అంత్యక్రియలు వెం టనే జరిగివుండేవని పేర్కొన్నారు. జపాన్ నుంచి రష్యాకు వెళ్లిన నేతాజి స్వాతంత్య్రం తరువాత ఉత్తర భారతదేశంలో గుర్తు తెలియని చోట జీవించి మృతిచెందారన్నారు.

మరిన్ని వార్తలు