ఇప్పుడే వివాహం చేసుకునే ఆలోచన లేదు

2 Jan, 2016 09:11 IST|Sakshi

చెన్నై : మలయాళ నటీమణులకు సొంత గడ్డపై అవకాశాలు ఇవ్వడం లేదని నటి మాయ కొత్త వివాదానికి తెర లేపారు. తమిళంలో ఎల్లా అవళ్ సెయల్, రామానుజన్ తదితర చిత్రాల్లో నటించిన నటి మాయకి ప్రస్తుతం అంతగా అవకాశాలు లేవు. ఈ విషయమై స్పందించిన ఆమె తానే చిత్రాలను తగ్గించుకున్నానని చెప్పారు.

షూటింగ్‌లతోనే అధిక భాగం గడిచిపోతోందని, దీంతో జీవితంలో ముఖ్యమైన విషయాలను చాలా మిస్ అవ్వాల్సి వస్తోందని అన్నారు. అందువల్ల స్లో అండ్ స్టడీ పాలసీని అవలంభిస్తున్నట్లు తెలిపారు. ఇకపోతే మలయాళ హీరోయిన్లకు తమిళం, తెలుగు భాషల్లో ఎక్కువ ప్రోత్సహిస్తున్నారనే ప్రచారం జరుగుతోందని, అయితే అక్కడ వారికి సొంత గడ్డపైన అవకాశాలు రాకపోవడంతోనే ఇతర భాషల్లో అవకాశాలు దక్కించుకునేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు.

మరో విషయం తన వివాహం గురించి వదంతులు ప్రచారమవుతున్నాయని, ప్రస్తుతానికి వివాహం చేసుకునే ఆలోచన లేదని స్పష్టం చేశారు.

మరిన్ని వార్తలు