చివరి ప్రయత్నంగా విదేశాల సాయం తీసుకుంటాం

25 Jul, 2016 17:23 IST|Sakshi
చివరి ప్రయత్నంగా విదేశాల సాయం తీసుకుంటాం

చెన్నై: నాలుగు రోజుల క్రితం అదృశ్యమైన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఏఎన్-32 విమానం ఆచూకీ ఇంకా లభించలేదు. ఈ విమానం కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని కోస్ట్ గార్డ్ ఐజీ రాజన్ బర్గోత్రా చెప్పారు. ఇప్పటి వరకు ఎలాంటి ఆచూకీ దొరకలేదని తెలిపారు.

16 నౌకలు, 13 విమానాలు, 4 హెలికాప్టర్లతో గాలిస్తున్నట్టు బర్గోత్రా చెప్పారు. ప్రస్తుతం ఇస్రో సహకారం తీసుకుంటున్నట్టు తెలిపారు. మరికొన్ని రోజులు గాలింపు జరుపుతామని ఆయన వెల్లడించారు. చివరి ప్రయత్నంగా విదేశాల సహకారం తీసుకుంటామని తెలిపారు.

శుక్రవారం ఉదయం తమిళనాడులోని తాంబరం నుంచి పోర్ట్ బ్లెయిర్ వెళుతున్న ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విమానం గల్లంతయిన సంగతి తెలిసిందే. ఈ విమానంలో మొత్తం 29 మంది ఉన్నారు. గల్లంతయిన వారిలో 9 మంది విశాఖపట్నం వాసులు ఉన్నారు.
 

మరిన్ని వార్తలు