దసరా ర్యాలీపై శివసేనలో ఉత్కంఠ

6 Oct, 2013 02:25 IST|Sakshi

సాక్షి, ముంబై: శివసేన ప్రతియేటా దాదర్‌లోని శివాజీపార్క్‌లో నిర్వహించే దసరా ర్యాలీ ఎక్కడ నిర్వహించనున్నారనే విషయం ఈసారి శివసేనకు తల నొప్పిగా మారింది. పార్టీ స్థాపించినప్పటి నుం చి ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా దాదర్‌లోని శివాజీపార్క్‌లో దసరా ర్యాలీ నిర్వహిస్తున్న విష యం విదితమే. అయితే శివాజీపార్క్ సెలైన్స్ జోన్ పరిధిలో ఉందని ఈసారి  బృహన్‌ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) అనుమతిని నిరాకరిం చింది. గతంలో కూడా ఇదే మాదిరిగా బీఎంసీ నిరాకరిస్తే హైకోర్టును ఆశ్రయించడంతో శివసేనకు అనుమతి లభించింది. అయితే ఈసారి శివాజీపార్క్‌లో దసరా ర్యాలీకి అనుమతి లభించే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. గతేడాదే హైకో ర్టు అనుమతించే సమయంలో వచ్చే ఏడాది ప్రత్యామ్నాయ వేదికను చూసుకోవాలని ఆదేశించిన విషయాన్ని ఆ పార్టీ కార్యకర్తలు గుర్తు చేసుకుంటున్నా రు. దీంతో దసరా ర్యాలీ కోసం శివాజీపార్క్ లభిం చకపోతే బాంద్రా-కుర్లా కాంప్లెక్స్‌లోని ఎమ్మెమ్మార్డీయే గ్రౌండ్, ఛత్రపతి శివాజీ టెర్మినస్ సమీపంలోని ఆజాద్ మైదాన్‌లో నిర్వహించాలని పార్టీ భావి స్తున్నట్టు సమాచారం.
 
 ఈసారి బీకేసీలో దసరా ర్యాలీ...?
 అయితే బీఎంసీ అనుమతి  నిరాకరించడంతో ముం దు జాగ్రత్తగా బీకేసీలోని ఎమ్మెమ్మార్డీయే మైదానం లో సభ నిర్వహించేందుకు అనుమతి కోరుతూ శివసేన పార్టీ దరఖాస్తు పెట్టుకుంది. దీంతో ఈసారి శివాజీపార్క్‌లో అనుమతి లభించకపోతే ఎమ్మెమ్మార్డీయే గ్రౌండ్‌లో జరిగే అవకాశాలు కనబడుతున్నా యి. అయినప్పటికీ శివాజీపార్క్ కోసం అన్ని విధా లా ప్రయత్నాలు చేస్తోంది.
 
 నాలుగు దశాబ్దాల చరిత్రలో మరో బ్రేక్..?
 శివసేన పార్టీ అవిర్భవించిన నాటినుంచి సుమారు నాలుగు దశాబ్దాలకుపైగా ఏటా దసరా రోజున శివాజీపార్క్ మైదానంలో దసరా ర్యాలీ నిర్వహిస్తోంది. అయితే అనివార్య కారణాలవల్ల కేవలం రెండుసార్లు మాత్రమే సభ జరగలేదు. అయితే ఈసారి అనుమతి లభించలేదు. దీంతో ఈసారి కూడా బ్రేక్ పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయి తే ర్యాలీ మరో ప్రాంతంలో జరగొచ్చు.
 
 మొదటిసారిగా బాల్‌ఠాక్రే లేకుండా..!
 దసరా రోజు జరిగే సభలో శివసేన అధినేత బాల్‌ఠాక్రే ప్రసంగం వినేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి కార్యకర్తలు లక్షల సంఖ్యలో తరలివస్తారు. అయితే ఈసారి తొలిసారిగా ఆయన లేకుండా సభ జరగనుంది. గతంలో అనారోగ్యం కారణంగా ఆయన ప్రసంగాన్ని సీడీల ద్వారా స్క్రీన్‌లపై విని పించారు. అయితే ఈసారి ఆయన మరణానంతరం తొలిసారిగా జరగనున్న శివసేన ప్రతిష్టాత్మకంగా భావించే దసరా ర్యాలీ సభకు అనుమతులు లభించకపోవడంతో కార్యకర్తల్లో కూడా ఆందోళన వ్యక్తమవుతోంది. అయితే ఈసారి కూడా ఆయన లేనిలోటు తీర్చేందుకు సభలో ఆయన గతంలో చేసిన ప్రసం గం సీడీలు ప్రదర్శించే అవకాశాలున్నాయి.  అలాగే ఆ పార్టీ కార్యధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే, అగ్రనాయకుడు మనోహర్ జోషీ, ఆదిత్య ఠాక్రే తదితరుల ప్రసంగాలే కీలకం కానున్నాయి. 

>
మరిన్ని వార్తలు