అక్రమంగా రేషన్ తరలిస్తే నాన్‌బెయిలబుల్ వారెంట్

4 May, 2015 23:01 IST|Sakshi

- పౌర సరఫరాల శాఖ ప్రతిపాదనకు సీఎం ఆమోదం
సాక్షి, ముంబై:
ఇకపై నిత్యవసర సరుకులు బ్లాక్ మార్కెట్లో విక్రయించే రేషన్ షాప్ డీలర్లపై నాన్‌బెయిల బుల్ కేసులు నమోదు చేయనున్నారు. ఆహార , పౌర సరఫరాల శాఖ ప్రతిపాదించిన ఈ సిఫార్సుకు ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అర్హులైన పేదలకు ప్రతి నెల రేషన్ కార్డు ద్వారా బియ్యం, గోధుమలు, కిరోసిన్, చక్కెర, పప్పు దినుసులు పంపిణీ చేస్తారు. అందులో చాలా వరకు సరుకులను రేషన్ డీలర్లు బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తున్నారు. కిరాణా షాపులకు నెలనెలా తరలిస్తున్నారు. రేషన్ అధికారులకు మామూళ్లు ముట్టడంతో చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలు కూడా ఉన్నాయి.

గతంలో నిత ్యవసర సరుకులు బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తుం డగా పట్టుబడిన కేసులు అనేకం ఉన్నాయి. రేషన్ కార్యాలయ అధికారులు, ఇన్‌స్పెక్టర్లు తరుచూ రేషన్ షాపుల్లో తనిఖీలు నిర ్వహిస్తున్నారు. సరుకు నిల్వలకు సంబంధించిన వివరాలు లేకున్నా, రేషన్ తీసుకున్న వారి వివరాలు రాయకున్నా చర్యలు తీసుకునే వారు. చిన్న కేసులు నమోదు చేయడంతో డీలర్లపై వాటి ప్రభావం కనిపించలేదు. ఈ నేపథ్యంలో ఇలాంటి అక్రమ రేషన్ డీలర్లపై కఠిన చర్యలు తీసుకోవాలనే ఉద్దేశంతో నాన్‌బెయిలెబుల్ కేసులు నమోదు చేయాలని ఆహార, పౌర సరఫరాల శాఖ తాజాగా రూపొందించిన ప్రతిపాదనను ఇది వ రకే ముఖ్యమంత్రికి సమర్పించింది. దీనికి సీఎం ఇప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

మరిన్ని వార్తలు