4,200 పోస్టుల భర్తీకి త్వరలో నోటిఫికేషన్

20 Dec, 2013 04:55 IST|Sakshi

పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వినయ్‌కుమార్ సూరకె
 
సాక్షి, బెంగళూరు : రాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖలో ఖాళీగా ఉన్న 4,200 పోస్టుల భర్తీకి త్వరలో నోటిఫికేషన్ విడుదల చేస్తున్నట్లు రాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వినయ్‌కుమార్ సూరకె వెల్లడించారు. ‘పట్టణాభివృద్ధిలో-నూతన సాంకేతిక అభివృద్ధి వినియోగం’ అనే అంశంపై విధానసౌధలో గురువారం ఏర్పాటు చేసిన సదస్సులో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడుతూ... సిబ్బంది కొరత వల్ల వివిధ ప్రభుత్వ శాఖల్లో అభివృద్ధి పనులు ఆలస్యం అవుతున్న మాట వాస్తవమన్నారు. పట్టణాభివృద్ధి శాఖలో ఖాళీగా ఉన్న 4,200 పోస్టులతోపాటు జలమండలిలోని 402 పోస్టుల భర్తీకి కూడా త్వరలో నోటిఫికేషన్ విడుదల చేయనున్నామన్నారు.

అదేవిధంగా సంక్షేమ పథకాలు పారదర్శకంగా అమలు చేసే చర్యల్లో భాగంగా గ్రామసభల మాదిరి వార్డు సభలు కూడా నిర్వహించే ఆలోచన ప్రభుత్వానికి ఉందన్నారు. పట్టణాల్లో భూస్వాధీన ప్రక్రియ నెమ్మదిగా జరుగుతుండటం వల్ల అభివృద్ధి పనులు నిదానంగా జరుగుతున్నాయన్నారు. ముఖ్యంగా పట్టణ, నగరాల్లో ప్రజలకు తాగునీటి సౌకర్యం కల్పిచడానికి ఉద్దేశించబడిన పథకాలు నత్తనడకన సాగడానికి ఇదే కారణమన్నారు. సమస్య పరిష్కారం దిశగా జలమండలిలో ‘ల్యాండ్ బ్యాంక్’ వ్యవస్థను ఏర్పాటు చేయనున్నామన్నారు.

ఇందుకు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కూడా అంగీకరించాని తెలిపారు. పట్టణ, నగర సంస్థల్లో అభివృద్ధి కార్యక్రమాల కోసం ‘ప్రత్యేక నిధి’ని ఏర్పాటు చేసే ఆలోచన కూడా ఉందన్నారు. ఈ విషయమై త్వరలో జరిగే మంత్రిమండలి సమావేశంలో స్పష్టమైన నిర్ణయం తీసుకోనున్నామన్నారు. నగర, పట్టణ ప్రాంతాల్లో అనుమతులు లేకుండా నిర్మించిన నివాస కట్టడాలు, వాణిజ్య భవనాలను కొంత అపరాధ రుసుంతో క్రయవిక్రయాలకు అనుమతించనున్నామన్నారు. ఈ విధంగా వచ్చిన సొవ ుు్మతో ఆయా సంస్థల పరిధిలో వలికసదుపాయాలు కల్పించనున్నామని మంత్రి విన య్ కుమార్ తెలిపారు.
 

>
మరిన్ని వార్తలు