'ప్రియురాలికి ప్రేమ ముద్దు, పిల్లలకు బర్త్డే ముద్దు'

14 Feb, 2014 13:21 IST|Sakshi
'ప్రియురాలికి ప్రేమ ముద్దు, పిల్లలకు బర్త్డే ముద్దు'

తిరువనంతపురం : ఎస్ఎంఎస్ లు మొన్నటి మాట. ఎమెమ్మెస్లు నిన్నటి మాట. మరి నేడు...? 'కిస్ఎంఎస్'లదే  హవా. ముద్దులు పంపే ఈ వినూత్న మొబైల్ అప్లికేషన్ ప్రేమికుల రోజు సందర్భంగా మార్కెట్లోకి విడుదలైంది. ప్రేమికులు ముద్దులు పంపుకోవడానికి మాత్రమే కాదు...  కుటుంబమంతా సంబంధాలను బట్టి ఆయా ముద్దులను పంపుకునేందుకూ ఈ కిస్ఎంఎస్ యాప్ ఉపయోగపడుతుందట. ఉదాహరణకు...ప్రియురాలికి ప్రేమ ముద్దు, పిల్లలకు బర్త్డే ముద్దు, అనారోగ్యంతో ఉన్నవారికి గెట్వెల్ సూన్ ముద్దు, ఇంకా గుడ్ మార్నింగ్ ముద్దు, న్యూఇయర్ ముద్దు, మిస్యూ ముద్దులూ... పూలబొకేలూ దీని ద్వారా పంపొచ్చు.

ఫోన్లో  మనకు నచ్చినవారి ఫోటోపై ఊ... ఉంటూ ముద్దు పెడుతూ ఆ  ముద్దును 10 సెకన్ల ఆడియోతో సహా వారికి సెండ్ చేయొచ్చు. వోల్మాచ్ బిజినెస్ సొల్యూషన్స్ అనే కంపెనీ తయారు చేసిన ఈ యాప్ ఐవోఎస్, ఆండ్రాయిడ్ ఫోన్లపై పనిచేస్తుంది. పాస్ కోడ్ ప్రొటెక్షన్తో ఈ ముద్దులకు పూర్తి రక్షణ ఉంటుందని కంపెనీవారు చెబుతున్నారు. అన్నట్టూ... అవతలివారిపై కోపం ఉందనుకోండి... వారి ముద్దులను తిరస్కరించి, కోపం తగ్గిన తర్వాత ఆ ముద్దులను స్వీకరించేందుకు కూడా ఈ యాప్తో వీలవుతుందట.

మరిన్ని వార్తలు