వామ్మో.. సీఎం సభా..?

3 Nov, 2016 02:05 IST|Sakshi
(ఫెల్‌ ఫొటో)
* హడలిపోతున్న డ్వాక్రా మహిళలు, విద్యార్థులు
సీఎం సభల ఏర్పాట్లతో బెంబేలు ఎత్తుతున్న అధికారులు
తాజాగా విట్‌ శంకుస్థాపనకు 15 వేల మంది విద్యార్థులను తరలించాలని ఆదేశం
 
జిల్లాలో  ముఖ్యమంత్రి  సమావేశాలంటే డ్వాక్రా మహిళలు, విద్యార్థులు, ప్రైవేటు స్కూల్‌ యజమాన్యాలు హడలిపోతున్నాయి.  నెలకు నాలుగైదు సార్లు  జిల్లాలో  ఏదో కార్యక్రమం పేరుతో సీఎం పర్యటనలు ఉండటంతో అధికారులకు తలనొప్పిగా మారింది.  ప్రభుత్వ , ప్రైవేటు  కార్యక్రమం ఏదైనా జనాలను తరలించించడం, ఏర్పాట్లు బాధ్యత అధికారులకే అప్పగిస్తున్నారు. దీంతో జిల్లాకు చెందిన వివిధ శాఖల అధికారులు
 
సాక్షి, అమరావతి బ్యూరో: జిల్లాలో సీఎం చంద్రబాబు మీటింగ్‌లు నిర్వహించే ప్రతిసారీ  డ్వాక్రా మహిళలు  విద్యార్థులే దిక్కు అవుతున్నారు. అధికారులు బతిమాలో, భయపెట్టే సభలకు వారిని  తరలిస్తున్నారు. హాజరయ్యే వారు ముఖ్యమంత్రి చెప్పే ఊక దంపుడు ఉపన్యాసాలతో బెంబేలెత్తుతున్నారు. ఈ గండం నుంచి గట్టెక్కెదట్టా అనుకుంటూ మదన పడుతున్నారు. రాజధానిలో ప్రభుత్వ భవనాల శంకుస్థాసన కార్యక్రమం ఘటనలు మరువక మందే మళ్ళీ విద్యార్థులను సీఎం సభలకు తరలించడం అధికారులకు కత్తిమీద సాముగా మారింది.
 
విద్యాశాఖ అధికారులకే బాధ్యతలు...
వేలూరు ఇన్‌స్టిట్యూట్‌ ఆప్‌ టెక్నాలజీ శంకుస్థాపనకు 15 వేల మంది విద్యార్థులను తరిలించే బాధ్యత డీఈఓ, ఆర్‌ఐఓ, ఇంజినీరింగ్, పాలిటెక్నికల్‌ కళాశాలలకు అప్ప జెప్పారు. ముఖ్యమంత్రి జిల్లా పర్యటనకు వచ్చిన ప్రతి సారీ  జనాలను తరలించేందుకు  ప్రైవేటు స్కూల్, కళాశాలలు, ఇంజినీరింగ్‌ కాలేజీ బస్సులను వినియోగిస్తున్నారు. మొన్న రాయపూడిలో జరిగిన ప్రభుత్వ శంకుస్థాపన కార్యక్రమానికి వెళ్లిన మహిళలు, విద్యార్థులు వర్షంతో అల్లాడిపోయారు. బస్సులో బురదలో ఇరుక్కుపోయి కదలేని పరిస్థితి నెలకొంది. నల్లరేగడి నేల కావడంతో నడవడానికి కూడా  కష్టపడ్డారు. గత అనుభవాన్ని దృష్టిలో ఉంచుకొని  సీఎం సభలకు విద్యార్థులను పంపేందుకు ప్రైవేటు స్కూలు, కళాశాల యజమాన్యాలు  ఆలోచిస్తున్నాయి. ఏదైనా జరగరానిది జరిగితే విద్యార్థుల తల్లిదండ్రులకు ఏమి సమాధానం చెప్పాలని  అందోళన వ్యక్తం చేస్తున్నారు. సీఎం సభల నిర్వహణలకు సరిగా నిధులు మంజూరు కాక పోవడంతో జిల్లా అధికారులకు సైతం తలకుమించిన భారంగా మారుతోంది.
మరిన్ని వార్తలు