వైఎస్‌ఆర్ ఆశయ సాధనకు కదలిరండి

28 Apr, 2014 03:21 IST|Sakshi
  • డాక్టర్ వైఎస్‌ఆర్  స్మారక ఫౌండేషన్ అధ్యక్షుడు భక్తవత్సలరెడ్డి
  •   ఓటర్లతో పుట్టపర్తి వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థి సోమశేఖరరెడ్డి మేనల్లుడు ముఖాముఖి
  •  7న పోలింగ్ ప్రక్రియకు తరలిరావాలని ప్రవాసాంధ్రులకు విజ్ఞప్తి
  •  బెంగళూరు, న్యూస్‌లైన్ : మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయ సాధనలో భాగంగా మే 7న ఆంధ్రప్రదేశ్‌లో జరగనున్న పోలింగ్ ప్రక్రియలో కచ్చితంగా పాల్గొని, ఫ్యాన్ గుర్తుకు  ఓటు వేయాలని ప్రవాసాంధ్రులకు కర్ణాటక డాక్టర్ వైఎస్‌ఆర్ స్మారక ఫౌండేషన్ అధ్యక్షుడు బి.భక్తవత్సల రెడ్డి పిలుపునిచ్చారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిని చేసేందుకు ఉద్యమించాలని అన్నారు. స్థానిక ఎలక్ట్రానిక్ సిటీలోని దొడ్డతోగూరులో ఆదివారం నిర్వహించిన ప్రవాసాంధ్ర ఓటర్ల సమావేశంలో ఆయన ప్రసంగించారు.

    ఎన్నికల ప్రచారంలో వైఎస్‌ఆర్ సీపీకి దక్కుతున్న ప్రజాదరణ చూసి నటుడు బాలకృష్ణకు పిచ్చిపట్టి  ఏమి మాట్లాడుతున్నాడో అతనికే అర్థం కాకుండా ఉందని ఎద్దేవా చేశారు. తొమ్మిదేళ్ల చంద్రబాబు పాలన చూసిన, వినిన వారెవ్వరూ మళ్లీ టీడీపీకి ఓటెయ్యరని అన్నారు. పుట్టపర్తి వైఎస్‌ఆర్ సీపీ అభ్యర్థి సోమశేఖరరెడ్డి మేనల్లుడు, అధ్యాపకుడు మధుసూదన్‌రెడ్డి మాట్లాడుతూ...  వైఎస్‌ఆర్ సీపీ అభ్యర్థులను గెలిపించేందుకు మే 7న జరిగే ఓటింగ్ ప్రక్రియకు తరలి రావాలని ప్రవాసాంధ్రులను కోరారు.

    వైఎస్ పాలనను, పథకాలను బంధువులకు, స్నేహితులకు వివరించి వారితో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయించాలని విజ్ఞప్తి చేశారు. సీమాంధ్ర అన్ని రంగాల్లోనూ అభివృద్ధి సాధించాలంటే 20కి పైగా లోక్‌సభ స్థానాలను వైఎస్‌ఆర్ సీసీకి అందించాలన్నారు.  సమావేశంలో రెండు వేలకు పైగా ప్రవాసాంధ్రులు పాల్గొన్నారు. అంతకు ముందు దివంగత నేత శోభానాగిరెడ్డికి నివాళులర్పించారు.

    పోలింగ్ ప్రక్రియకు తరలి వెళ్లేవారు బత్తుల అరుణాదాస్ (9535119942), ఎస్.రాజశేఖరరెడ్డి(9448854651), డి.ఎల్.రంగారెడ్డి(9845744847), లోకేశ్వరరెడ్డి(9986531659), భక్తవత్సలరెడ్డి(888002288)ని సంప్రదించాలని సూచించారు. కార్యక్రమంలో ఫౌండేషన్ కోశాధికారి కొండా దామోదరరెడ్డి, ప్రవాసాంధ్రులు నాగరాజరెడ్డి, చంద్రశేఖరరెడ్డి, ఉమాపతిరెడ్డి, రాజారెడ్డి, కేశవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.  
     

>
మరిన్ని వార్తలు