మనమడిని చూడాలని..

16 Jun, 2018 08:59 IST|Sakshi
మనమడితో సత్యశీలన్, మారిముత్తు దంపతులు

పదేళ్ల తరువాత మనమడిని కలుసుకున్న వృద్ధ దంపతులు

పెరంబూరు: కొడుకు, కోడలు మనస్పర్థలతో విడిపోయారు. కనీసం మనమడిని చూడలేక వేదనతో తపించిన  ఆ వృద్ధ దంపతుల కోరిక పదేళ్ల తరువాత ఎట్టకేలకు తీరింది. వివరాలు.. చెన్నై సమీపం సిట్లపాక్కంకు చెందిన సత్యశీలన్‌ మారిముత్తుకు 72 ఏళ్లు. ఈయన కొడుకుకు వివాహమై ఒక కొడుకు ఉన్నాడు. కొడుకు, కోడలు మనస్పర్థల కారణంగా విడిపోయారు. దీంతో కోడలు తన కొడుకును తీసుకుని అమెరికా వెళ్లిపోయింది.కొడుకు కూడా పని నిమిత్తం వేరే ఊరు వెళ్లిపోయాడు. అలా పదేళ్లు గడిచిపోయాయి. సత్యశీలన్‌మారిముత్తు దంపతులకు మనమడిని ఒక్కసారి చూడాలన్న ఆశ కలిగింది.

ఈ క్రమంలో రెండు రోజుల కిందట మనమడు చెన్నైకి వచ్చినట్లు తెలియడంతో వారి ఇంటికి వెళ్లారు. అక్కడ ఎవరూ లేరన్న సమాధానంతో ఒక రోజు అంతా అక్కడే మండుటెండను కూడా లెక్క చేయకుండా ఉన్నా ఫలితం లేకపోయింది. దీంతో సత్యశీలన్‌ దంపతులు చెన్నై పోలీస్‌ కమిషనర్‌ ఏకే.విశ్వనాధన్‌ను కలిసి తమ మనోవేదనను వెలిబుచ్చుకున్నారు. స్పందించిన పోలీస్‌ కమిషనర్‌ జెయింట్‌థామస్‌ జాయింట్‌ కమిషనర్‌  ముత్తుస్వామికి ఫోన్‌ చేసి ఎలాగైన సత్యశీలన్‌ మనమడిని పోలీస్‌స్టేషన్‌కు తీసుకురావాలని ఆదేశించారు. వారి కృషి ఫిలించి గురువారం ఆ దంపతుల మనుమడిని, కోడలిని పోలీస్‌ స్టేషన్‌కు వచ్చారు. మనవడిని తనివి తీరా చూసుకున్న వృద్ధ దంపతులు పోలీస్‌ కమిషనర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం బాలుడు తన తల్లితో వెళ్లిపోయాడు.

మరిన్ని వార్తలు