ఆదివారం సెలవు తీసుకోవద్దు

1 Jun, 2014 23:05 IST|Sakshi

సాక్షి, ముంబై: గొలుసు దొంగతనాలకు పాల్పడుతున్నవారిపై ఉక్కుపాదం మోపాలని నగర  పోలీస్ కమిషనర్ రాకేశ్ మారియా నిర్ణయించారు. వీరి ఆగడాలను అరికట్టేందుకు ఆదివారం ముంబై పోలీసులెవరూ సెలవు(వీక్లీ ఆఫ్) తీసుకోవద్దని ఆదేశాలు జారీ చేశారు. ఆదివారం పోలీసుల సంఖ్య తక్కువగా ఉండడం, సెలవురోజు కావడంతో నగరవాసు లు షాపింగ్ కోసం మార్కెట్లకు రావడంతో చైన్‌స్నాచర్లు రెచ్చిపోతున్నారు. దీంతో వారి ఆటకట్టించేందుకు ఆదివారం నగరంలోని ప్రతీ వీధిలో, ప్రధాన మార్కెట్లలో పెట్రోలింగ్ నిర్వహించాలని నిర్ణయిం చారు. అందుకోసం ఆరోజు పోలీసులు ఎవరూ సెలవు తీసుకోవద్దని ఆదేశాలు జారీచేశారు. ఆదివారానికి బదులుగా మరోరోజు సెలవు తీసుకోవాల న్నారు. తాము తీసుకుంటున్న చర్యల ఫలితంగా గత 60 రోజుల్లో గొలుసు దొంగతనాల సంఖ్య 60 శాతం తగ్గిందన్నారు.

 భద్రత మరింత పటిష్టం...
 నగరంలో భద్రతను మరింత పెంచాల్సి ఉందని కమిషనర్ పేర్కొన్నారు. కేవలం మహిళలకు మాత్రమేకాకుండా రాత్రి వేళ్లలో చీకట్లో ఒంటరిగా వెళ్లే ప్రతి ఒక్కరినీ దృష్టిలో ఉంచుకొని భద్రత కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. అయితే రాత్రి వేళ్లలో ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తుతున్నప్పుడు ఎవరైనా ద్విచక్రవాహనంపై వెంబడిస్తున్నారా? అని గమనించాలని సూచించారు. అయితే అన్ని పోలీస్టే షన్ల అధికారులు ఆదివారం కూడా విధులకు హాజ రై వీధుల్లో నాకాబందీ నిర్వహిస్తున్నారా? లేదా? గమనించాలని, ఏవైనా ఫిర్యాదులుంటే వెంటనే తెలియజేయాలన్నారు. దీంతో చైన్ స్నాచర్లు, దొంగ లు తప్పించుకోవడానికి ఆస్కారం ఉండదని మారి యా ఆశాభావం వ్యక్తం చేశారు. ఆదివారాల్లో.. ముఖ్యంగా ఉదయం, సాయంత్రం వేళల్లో నాకాబందీ నిర్వహించాల్సిందిగా మారియా సంబంధిత అధికారులను ఆదేశించారు.

 2013లో 2,090 చైన్ స్నాచింగ్ కేసులు నమోదు కాగా, గత రెండు నెలలు (మార్చి, ఏప్రిల్)గా వీటి సంఖ్య 60 శాతం మేర తగ్గినట్లు ఆయన తెలిపారు. పోలీసుల సంఖ్య పెంచడం, తరచూ నాకాబందీలు నిర్వహిస్తుండడంతోనే ఇది సాధ్యమైందన్నారు. ముంబైలో చైన్ స్నాచింగ్ అతిపెద్ద సమస్యగా మారిందని డీసీపీ మహేష్ పాటిల్ అభిప్రాయపడ్డారు. అన్ని పోలీస్టే షన్లు ప్రత్యేక స్క్వాడ్‌లను ఏర్పాటు చేసి తరచూ చైన్ స్నాచింగ్‌లు జరుగుతున్న ప్రాంతాలను గుర్తించి, సదరు ప్రాంతాలపై దృష్టి సారించాలని సూచించారు.

మరిన్ని వార్తలు