అనాథల ప్రేమపాశం

4 Jun, 2020 07:57 IST|Sakshi
వృద్ధునికి అన్నం తినిపిస్తూ...

చెన్నై,టీ.నగర్‌: మానవత్వం బతికే ఉందని తెలిపే ఘటన నగరంలో చోటుచేసుకుంది. అరవకురిచ్చి– కరూరు రోడ్డు సోమవారం రాత్రి 9 గంటల సమయంలో జనసంచారం లేకుండా నిర్మానుష్యంగా కనిపించింది. ఆ సమయంలో నడవలేని స్థితిలో 70 ఏళ్ల వృద్ధుడు కాళ్లతో దేక్కుంటూ నడిరోడ్డుపై వెళ్లసాగాడు. ఆ సమయంలో ఆ ప్రాంతానికి చెందిన కొందరు వృద్ధున్ని చేతులతో పట్టుకుని రోడ్డు పక్కన కూర్చోబెట్టారు. అతనితో మాటలు కలపగా మతిస్థిమితం లేని వ్యక్తిగా తెలిసింది. అతనికి ఓ మహిళ ఆహారం అందజేయగా, అతను తినడానికి నిరాకరించి నీళ్లు మాత్రం అడిగి తాగాడు. అదే సమయంలో అటువైపుగా వచ్చిన మరో అనాథ ఏదో పాట పాడుకుంటూ వెళ్లసాగాడు. ఆ సమయంలో వృద్ధుడు నిరాకరించిన ఆహారాన్ని అతనికి ఇచ్చారు. వెంటనే అతను ఆహారం తీసుకుని వృద్ధుని దగ్గరకు వెళ్లి, అయ్యా! కొంచెం తినండి.. అని బతిమాలాడు. అందుకు వృద్ధుడు నువ్వు తింటే నేను తింటానని పట్టుబడడంతో సదరు వ్యక్తి ఆ వృద్ధునికి చేతితో గోరుముద్దలు తినిపించి, తానూ తిన్నాడు. అనాథల ప్రేమపాశం అక్కడున్న వారి కళ్లు చెమర్చేలా చేశాయి. 

Read latest State News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు