త్రివర్ణ శోభ

24 Jan, 2014 23:49 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ:  గణతంత్ర వేడుకలను పురస్కరించుకొని రాజ్‌పథ్‌ను మూడు రంగుల జెండాలతో అలంకరిం చారు. ఎటు చూసినా మువ్వన్నెల రెపరెపలతో రైసినాహిల్స్ ప్రాంతం శోభాయమానంగా మారిపోయింది. రాష్ట్రపతిభవన్, నార్త్‌బ్లాక్, సౌత్‌బ్లాక్,పార్లమెంట్ భవనాలను విద్యుత్‌దీపాలతో అలంకరిం చారు. గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఎలాంటి అపశ్రుతి చోటు చేసుకోకుండా సాయుధ బలగాలు డేగకళ్లతో పహారా కాస్తున్నాయి.

ఇండియాగేట్‌తోసహా రాజ్‌పథ్ మార్గానికి ఇరువైపులా ఏర్పాటు చేసిన గ్యాలరీలను అనువణుకు తనికీ చేశారు. రాత్రి వేళ ల్లో తిరిగే వాహనాలను క్షణ్ణంగా తనిఖీ చేసిన తర్వా తే వదులుతున్నారు. ఇప్పటికే సెంట్రల్ ఢిల్లీతోపాటు పలు ప్రాంతాలను పోలీసు బలగాలు అదుపులోకి తీసుకున్నాయి.

 పలుచోట్ల ట్రాఫిక్ ఆంక్షలు..
 గణతంత్య్ర దినోత్సవంగా సందర్భంగా నిర్వహించనున్న వేడుకలతో పలు రూట్లలో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్టు ట్రాఫిక్ జాయింట్ సీపీ అనిల్‌శుక్లా తెలిపారు. ఆదివారం ఉదయం 9.50 గంటలకు పరేడ్ విజయ్‌చౌక్ నుంచి రాజ్‌పథ్, ఇండియాగేట్, తిలక్‌మార్గ్, బహదూర్ షాజాఫర్ మార్గ్, నేతాజీ సుభాష్ మార్గ్ మీదుగా ఎర్రకోట చేరుకుంటుందన్నారు.

 ఈ ప్రాంతాల్లో ట్రాఫిక్ నిషేధం...
 కౌటిల్యమార్గ్, ఔరంగజేబ్ రోడ్ క్యూ పాయింట్, హుమాయున్‌రోడ్, సుబ్రహ్మణ్య భారతిమార్గ్, మధురరోడ్, భగవాన్‌దాస్‌రోడ్, ఫిరోజ్‌షారోడ్, విన్‌డ్సర్‌ప్లేస్, అశోకరోడ్, బాబా కడక్‌సింగ్ మార్గ్, మధర్ థెరిస్సా క్రిసెంట్, సర్దార్‌పటేల్ మార్గ్‌ల్లో ట్రాఫిక్ నిషేధం అమలులో ఉంటుంది. కేవ లం అనుమతి ఉన్న వాహనాలను మాత్రమే ఉదయం ఆరుగంటల నుంచి 12.30 వరకు అనుమతిస్తారని సంబంధిత అధికారి ఒకరు తెలిపారు.

 న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌కి  వెళ్లేందుకు..
 సౌత్ ఢిల్లీ నుంచి: మధర్‌థెరిస్సా క్రిసెంట్-ఆర్‌ఎమ్‌ఎల్ హాస్పిటల్-బాబా కడక్‌సింగ్ మార్గ్-ఔటర్ సర్కిల్ కన్నాట్‌ప్లేస్-చెమ్స్‌ఫోర్డ్ రోడ్ మీదుగా పహార్‌గంజ్‌వైపు, అజ్మీర్‌గేట్‌వైపునకు మింట్‌రోడ్, భావ్‌బుతిమార్గ్ మీదుగా వెళ్లొచ్చు.
 నార్త్ ఢిల్లీ నుంచి: జండేవాలన్ వయా రాణిఝాన్సీ రోడ్డు,డీబీరోడ్,షీలాసినిమారోడ్, పహార్‌గంజ్ మీదుగా వెళ్లొచ్చు.
 ఈస్ట్ ఢిల్లీ నుంచి: బోలీవర్డ్‌రోడ్ వయా ఐఎస్‌బీటీ బ్రిడ్జి మీదుగా రాణిఝాన్సీ రోడ్-జండేవాలన్,డీబీ.గుప్తా రోడ్-షీలాసినిమా రోడ్-పహార్‌గంజ్ మీదుగా వెళ్లొచ్చు.

 పాత ఢిల్లీ రైల్వే స్టేషన్‌కి వెళ్లేందుకు...
 సౌత్ ఢిల్లీ నుంచి: రింగ్‌రోడ్-ఆశ్రమ్‌చౌక్-సరాయికలేఖాన్-రింగ్‌రోడ్-రాజ్‌ఘాట్-రింగ్‌రోడ్-చౌక్‌యమునా బజార్-ఎస్‌పీ.ముఖర్జీ మార్గ్-చత్తర్‌రైల్-కరాయిబ్రిడ్జిమీదుగా వెళ్లొచ్చు.
 నార్త్ ఢిల్లీ నుంచి: బోలీవర్డ్ రోడ్-మోరీగేట్,పుల్‌డుఫ్రిన్-ఎస్‌పీ.ముఖర్జీమార్గ్ మీదుగా వెళ్లొచ్చు.

Read latest State News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా