-

సీఎం పగ్గాలు చేపట్టినా...అదే ఇంట్లో

12 Dec, 2016 14:32 IST|Sakshi
సీఎం పగ్గాలు చేపట్టినా...అదే ఇంట్లో

సీఎం పగ్గాలు చేపట్టినా, గ్రీన్ వేస్‌రోడ్డులోని ప్రభుత్వ గృహంలోనే  ఓ పన్నీరు సెల్వం బస చేశారు. ఇది వరకు తమిళనాడును ఏలిన సీఎంలు అందరూ తమ తమ స్వగృహాల నుంచి సచివాలయం బాట పట్టారు. అరుుతే, ఇక,  ప్రప్రథమంగా ఈ సీఎం ప్రభుత్వ గృహం నుంచి బయలు దేరనున్నారు.  ప్రభుత్వ వెబ్ సైట్ నుంచి జయలలిత పేరును తొలగించి పన్నీరు పేరును సీఎంగా ప్రకటించారు. అరుుతే, ఇది వరకటి వలే ఆయనకు సాధారణ భద్రతే కొనసాగుతున్నది.
 
సాక్షి,చెన్నై: దివంగత సీఎం అమ్మ జయలలిత నమ్మిన బంటు పన్నీరు సెల్వంకు అదృష్టం కలిసి రావడంతో మళ్లీ..మళ్లీ సీఎం అయ్యే చాన్‌‌స దక్కుతున్న విషయం తెలిసిందే.  ఆయన మంత్రిగా ఉన్నా , సీఎం పగ్గాలు చేపట్టినా గ్రీన్ వేస్ రోడ్డులోని గృహంలోనే నివాసం ఉండదలచుకున్నారేమో. 2001లో , 2014-15లో సీఎంగా బాధ్యతలు నిర్వర్తించినప్పుడు కూడా ఆయన ఆ గృహాన్ని వదలి పెట్ట లేదు. ప్రస్తుతం అమ్మ జయలలిత అందర్నీ వీడి అల్లంత దూరాలకు వెళ్లడంతో మళ్లీ సీఎం అయ్యే చాన్‌‌స పన్నీరుకు దక్కింది. అరుునా, అదే బంగళాలోనే పన్నీరు బస చేస్తుండడం గమనార్హం.  సీఎం పగ్గాలు చేపట్టి గురువారంతో మూడు  రోజులు అవుతున్నా, ఆయన ఇంటి ముందు బోర్డు మాత్రం ఆర్థిక మంత్రిగానే ఉండడం మీడియా దృష్టికి చేరింది. దీన్ని పసిగట్టిన అక్కడి సిబ్బంది ఆగమేఘాలపై తొలగించి సీఎం బోర్డు తగిలించేందుకు సిద్ధమయ్యారు.

 అలాగే, గ్రీన్ వేస్‌రోడ్డులో ఇది వరకు కల్పించ బడ్డ సాధారణ భద్రతే కొనసాగుతున్నది. ఇక, మరింతగా భద్రత  కట్టుదిట్టం చేసిన పక్షంలో అటు వైపుగా వెళ్లే వారికి, ఆ పరిసర వాసులకు తనిఖీల బాధ తప్పదేమో. కాగా, ప్రభుత్వ గృహం నుంచి ప్రభుత్వ వ్యవహారాల్లో బిజీ అయ్యే సీఎంలలో ప్రథముడిగా పన్నీరు రాష్ట్రంలో చోటు దక్కించుకోనున్నారు. అదృష్టం కొనసాగి,  పూర్తి స్థారుులో సీఎంగా పనిచేసిన పక్షంలో కొత్త రికార్డును సృష్టిస్తారేమో. ఇందుకు కారణం, ఇది వరకు సీఎంలుగా రాష్ట్రాన్ని పాలించిన వాళ్లందరూ తమ తమ సొంత ఇళ్ల నుంచి సచివాలయంకు ప్రతి రోజూ బయలు దేరి వెళ్లడమే.  

అమ్మ జయలలిత పోయెస్ గార్డెన్‌లోని స్వగృహం, కరుణానిధి గోపాలపురంలోని స్వగృహం నుంచి ప్రభుత్వ వ్యవహారాల్లో బిజీ అయ్యే వారు. అంతకు ముందు సీఎంలుగా ఉన్న వాళ్లూ చెన్నైలోని తమ సొంత ఇళ్ల నుంచి బయ లు దేరి వెళ్లినట్టు సంకేతాలు ఉన్నారుు. అరుుతే, ప్రభుత్వ గృహాన్ని ఎక్కువ కాలం ఉపయోగించుకున్న సీఎంలలో ప్రథముడు పన్నీరే. గతంలో అన్నా మరణించినప్పుడు తాత్కాలిక సీఎంగా ఉన్న నెడుంజెలియన్ కొద్ది రోజులు మాత్రమే ప్రభుత్వ గృహాన్ని వినియోగించుకుని ఉన్నారు.

అమ్మ పేరు తొలగింపు : రాష్ట్ర ప్రభుత్వ వెబ్ సైట్ నుంచి సీఎం జయలలిత పేరును తొలగించి పన్నీరు సెల్వం పేరును పొందు పరిచారు. ఇది వరకు అమ్మ చేతిలో ఉన్న అన్ని శాఖలు , తన చేతిలో ఉన్న ఆర్థిక శాఖ కూడా పన్నీరు వద్దకు వచ్చారుు. పన్నీరు తదుపరి స్థానంలో అటవీ శాఖ మంత్రి దిండుగల్ శ్రీనివాసన్,  మూడో స్థానంలో ప్రజాపనుల శాఖ మంత్రి ఎడపాడి పళని స్వామి, తదుపరి సెల్లూరు రాజు, తంగమణి, ఎస్‌పీ వేలుమణి, జయకుమార్, సీవీ షణ్ముగం, కేపి అన్భళగన్, వి సరోజ, ఎంసీ సంపత్, కేసీ కరుప్పనన్నన్, ఆర్‌కామరాజ్, ఓఎస్ మణియన్, ఉడుమలై కే రాధాకృష్ణన్, సి.విజయ భాస్కర్, ఆర్ దురైకన్ను, కడంబూరు రాజు, ఆర్‌బీఉదయకుమార్, ఎల్లమండి నటరాజన్, కేసీ వీరమణి, కే.పాండియరాజన్, కేటీ రాజేంద్ర బాలాజీ, బెంజిమిన్, నిలోఫర్ కబిల్, ఎంఆర్ విజయభాస్కర్, ఎం.మణిగండన్, వీఎం రాజలక్ష్మి, జి.భాస్కరన్, సెవ్వూరు ఎస్ రామచంద్రన్, ఎస్ వలర్మతి, బాలకృష్ణారెడ్డి పేర్లు మంత్రుల జాబితాలో వరసుగా చేర్చి ఉన్నారు.

తొలి లేఖ : కేంద్రానికి దివంగత సీఎం జయలలిత లేఖాస్త్రాలను తరచూ సంధించడం గురించి తెలిసిందే. ఆదిశలో సీఎం పగ్గాలు చేపట్టిన పన్నీరు నడిచే అవకాశాలు ఉన్నారుు. ఇందుకు నిదర్శనంగా తొలి లేఖాస్త్రం సీఎం హోదాలో గురువారం ప్రధాని నరేంద్ర మోదీకి పన్నీరు సెల్వం లేఖ రాశారు. కచ్చదీవుల్లోని అంతోనియర్ ఆలయాన్ని ఇటీవల అభివృద్ధి పరిచే పనిలో శ్రీలంక చర్యలు తీసుకున్న విషయం తెలిసిందే. ఒకప్పుడు ఈ భూ భాగం తమిళనాడులో కలిసి ఉన్న విషయం తెలిసిందే. అందుకే  ఈ ఆలయంపై తమిళ జాలర్లకు హక్కు ఉంది. ప్రతి ఏటా ఇక్కడ జరిగే ఉత్సవాలకు తమిళ జాలర్లు తరలి వెళ్తారు. ఇందులో భాగంగా కొత్తగా రూపుదిద్దుకున్న ఆలయం ప్రారంభోత్సవం మరి కొద్ది రోజుల్లో జరగనుంది. ఈ వేడుకకు తమిళ జాలర్లను పంపించేందుకు తగ్గ అనుమతులు ఇవ్వాలని కోరుతూ ప్రధాని నరేంద్ర మోదీకి సీఎం పన్నీరు సెల్వం లేఖ రాయడం విశేషం.

మరిన్ని వార్తలు