'అభినందన'లు

6 Mar, 2019 11:43 IST|Sakshi
శిశువు అభినందన్‌తో రైతు దంపతులు

బాగల్‌కోట జిల్లాలో  

ఇద్దరు శిశువులకు పైలట్‌ పేర్లు  

యశవంతపుర: శతృదేశంపై అపార ధైర్యసాహసాలతో వైమానిక దాడి జరిపిన వాయుసేన పైలట్‌ అభినందన్‌కు గు ర్తుగా తమ బిడ్డలకు ఆయన పేరే పెట్టుకుని మురిసిపోతున్నారు తల్లిదండ్రులు. బాగలకోట జిల్లా ముధోళ్‌ పట్టణంలో జనతా ప్లాట్‌కు చెందిన రైతు సిద్ధ అంబిగేర, కమల దంపతులకు సోమవారం మగబిడ్డ జన్మించాడు. చిన్నారికి అభినందన్‌ అని నామకరణం చేశారు.  
ఈమె అభినందన  : బాగలకోట జిల్లా ఇళకల్‌కు చెందిన అరవింద్‌ జమఖండి కూతురికి అభినందనగా నామకరణం చేశారు. వింగ్‌ కమాండర్‌ గౌరవార్థం ఈ పేరు పెట్టుకున్నట్లు తెలిపారు.

Read latest State News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా