ఆకాశ మార్గంలో కొకైన్ స్మగ్లింగ్

21 Aug, 2015 17:58 IST|Sakshi
ఆకాశ మార్గంలో కొకైన్ స్మగ్లింగ్

బెంగళూరు: మాదకద్రవ్యాల అక్రమరవాణా కోసం పాతాళంలో భారీ సొరంగాలు తొవ్వడం మెక్సికన్ స్మగ్లర్ల స్టైల్. అంతకు తక్కువేమీ కాదంటూ బాహాటంగా ఆకాశమార్గంలో ఇండియాకు కొకైన్ తరలిస్తూ ఓ వ్యక్తి పట్టుబడ్డాడు.

 

బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వివరాలను నార్కోటిక్స్ అధికారులు శుక్రవారం వెల్లడించారు.

ఎమిరెట్స్ విమానంలో దుబాయ్ నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడి నుంచి రూ. 20 కోట్ల విలువైన 3.34 కేజీల కొకైన్ ను ఎయిర్ పోర్టు అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

 

టెక్ నగరం బెంగళూరులో జరిగే నైట్ పార్టీల కోసమే ఈ కొకైన్ సరఫరా అవుతున్నట్లు గుర్తించామని పోలీసులు చెప్పారు. నిందితుడ్ని జ్యుడిషిల్ కస్టడీకి తరలించామని, కేసును మరింత లోతుగా దర్యాప్తు చేశామని తెలిపారు. ఎయిర్ పోర్టులో ఇంత భారీ స్థాయిలో కొకైన్ పట్టుబడటం ఇదే మొదటిసారి కావడం గమనార్హం.

మరిన్ని వార్తలు