శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ప్రయాణికుల ఆందోళన

20 Sep, 2016 12:09 IST|Sakshi

టూరిస్టు వీసాలు తీసుకున్న 56 మంది ప్రయాణికులను అధికారులు విమానం ఎక్కేందుకు అనుమతించలేదు. దీంతో ప్రయాణికులు ఎయిర్ పోర్టులో ఆందోళనకు దిగారు. ఈ ఘటన మంగళవారం శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో జరిగింది. వివారాల్లోకి వెళితే.. కొంత మంది రంగారెడ్డి జిల్లా శంషాబాద్ విమానాశ్రయంలో దుబాయ్ ఎయిర్ లైన్స్ అధికారులు ప్రయాణికులకు అనుమతి నిరాకరించారు. వీరంతా కలర్ఫుల్ ట్రావెల్స్ ద్వారా దుబాయ్ వెళ్లేందుకు టూరిస్టు వీసాలు తీసుకున్నారు. అయితే.. అధికారులు ప్రయాణికులను ఎందుకు అడ్డుకున్నారో తెలియ రాలేదు. దీంతో ఆగ్రహం చెందిన ప్రయాణీకులు విమానాశ్రయంలోనే నిరసనకు దిగారు. విమానాశ్రయ అధికారులు, ప్రయాణికులతో చర్చలు జరుపుతున్నారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

 

మరిన్ని వార్తలు