రోగులపై ప్రై‘వేటు’

7 Apr, 2014 01:51 IST|Sakshi
రోగులపై ప్రై‘వేటు’
  • రిజిస్ట్రేషన్, కన్సల్టేషన్  ఫీజులు 30 శాతం వరకు పెంపు
  •  పెరిగిన నిర్వహణ భారం
  •  తప్పదంటున్న  ఆస్పత్రి యాజమాన్యాలు
  •  సాక్షి ప్రతినిధి, బెంగళూరు : ప్రభుత్వ ఆస్పత్రుల్లో అర కొర వసతులు, వైద్యుల కొరత...తదితర కారణాల వల్ల పేదలు సైతం ప్రైవేట్ ఆస్పత్రుల వైపు చూస్తున్న తరుణంలో వాటిల్లో ఫీజులు పెరిగిపోయాయి. నగరంలోని అనేక ఆస్పత్రులు రిజిస్ట్రేషన్, కన్సల్టేషన్ ఫీజులను పది నుంచి 30 శాతం వరకు పెంచేశాయి. ఈ నెల ఒకటో తేదీ నుంచే పెంచిన ఫీజులను వసూలు చేస్తున్నారు. అన్ని ధరలు పెరుగుతున్న దశలో ఆస్పత్రుల్లో ఫీజులను పెంచడం సహేతుకమేనని ప్రైవేట్ యాజమాన్యాలు తమ నిర్ణయాన్ని సమర్థించుకుంటున్నాయి.

    ఆస్పత్రి నిర్వహణా ఖర్చులు, వైద్యుల వేతనాలు, సర్జరీ ఖర్చులు పెరిగినందున అదే నిష్పత్తిలో ఫీజులను పెంచక తప్పలేదని చెబుతున్నాయి. హెబ్బాళలోని కొలంబియా ఏషియా ఆస్పత్రి, బాప్టిస్ట్, పాత విమానాశ్రయం రోడ్డులోని మణిపాల్, ఎంఎస్‌ఆర్ నగరలోని ఎంఎస్. రామయ్య, తిలక్ నగరలోని సాగర్, నృపతుంగ రోడ్డులోని సెయింట్ మార్తాస్ ఆస్పత్రుల్లో ఫీజులు పెరిగాయి.

    నారాయణ హృదయాలయలో అనేక పరీక్షలకు సంబంధించిన ఫీజులను గత జనవరి నుంచే 10 నుంచి 15 శాతం పెంచారు. పెరిగిన ఛార్జీల అనంతరం...హాస్‌మాట్ ఆస్పత్రిలో వివిధ రోగాలకు సంబంధించి కన్సల్టేషన్ ఫీజులు రూ.250 మొదలు రూ.550 వరకు ఉన్నాయి. = విఠల్ మల్య ఆస్పత్రిలో కన్సల్టేషన్ ఫీజును రూ.400, రిజిస్ట్రేషన్ ఛార్జీని రూ.100గా నిర్ణయించారు. ఆపోలో ఆస్పత్రి కూడా ఫీజులను పెంచే దిశగా యోచిస్తోంది.
     
     ఎక్కడెక్కడ.. ఎంతెంత...

     
    =  బాప్టిస్ట్ ఆస్పత్రిలో సాధారణ కన్సల్టేషన్ ఫీజు రూ.50 నుంచి రూ.70కి పెరిగింది. రెండోసారి కన్సల్టేషన్ ఫీజు రూ.30 నుంచి రూ.50కి పెంచారు. ఇతర కన్సల్టేషన్ ఫీజును రూ.175 నుంచి రూ.250కి పెంచారు.
     
     = కొలంబియా ఏషియా ఆస్పత్రిలో రూ.500 నుంచి రూ.600  
     
     = రామయ్య ఆస్పత్రిలో రూ.300 నుంచి రూ.350
     
     = సాగర్ ఆస్పత్రిలో రూ.250 నుంచి రూ.300కు, రూ.350 నుంచి రూ.450కు పెరిగాయి.
     
     = మణిపాల్ ఆస్పత్రిలో గతంలో రూ.400, రూ.500 ఉన్న కన్సల్టేషన్ ఫీజును రూ.వంద చొప్పున పెంచారు.

>
మరిన్ని వార్తలు