కరోనా కేసులపై బెట్టింగ్‌ల జోరు

13 Jul, 2020 07:56 IST|Sakshi

సాక్షి, బెంగళూరు: రాజకీయాలు, సినిమా, క్రికెట్‌ ఇలా అన్నింట్లో బెట్టింగుల జోరు నడుస్తూ ఉండడం చూశాం కదా!  కానీ కాదేదీ బెట్టింగ్‌కు అనర్హం అన్నట్లు ఇప్పుడు తాజాగా కోవిడ్‌–19పై పందెరాయుళ్లు పందేరాలు నడిపిస్తున్నారు. కర్ణాటకలో కోవిడ్‌–19 విధ్వంసం సృష్టిస్తోంది. కరోనా ప్రారంభంలో నెమ్మదిగా సాగితే ప్రస్తుతం ఒక్కసారిగా భారీ విస్ఫోటనం చెందుతూ అంతకంతకు విస్తరిస్తోంది. ఇలాంటి కరోనా కేసులపై బెట్టింగులు కూడా బాగానే జరుగుతున్నాయి.  

హెల్త్‌ బులిటిన్‌పై ఆధారపడి : కరోనా వైరస్‌ కేసులు వందల స్థాయి నుంచి వేల స్థాయికి చేరుకున్నాయి. రోజుకి వెయ్యి నుంచి రెండు వేలకు పైగా కరోనా కేసులు నమోదు అవుతున్నాయి. కాగా, ఈ రోజు ఎన్ని కేసులు నమోదు అవుతాయి? వెయ్యినా లేదా రెండు వేలా అంటూ బెట్టింగులు జోరుగా నడుస్తున్నాయి.. ప్రతి రోజూ సాయంత్రం హెల్త్‌ బులిటిన్‌ విడుదల అయిన తర్వాత ఆ సంఖ్యను చూసి ఆ తర్వాత గెలిచిన వ్యక్తి ఖాతాకు నగదును ట్రాన్స్‌ఫర్‌ చేస్తున్నారు. క్రికెట్‌ తరహాలో కోవిడ్‌ బెట్టింగ్‌లు చాలా చురుకుగా సాగుతున్నాయి. చదవండి: సీఎం సమీక్ష.. పకడ్బందీగా రాబోయే లాక్‌డౌన్‌ 
 
గ్రామీణ ప్రాంతాల్లోనే : ‘ఈ రోజు కర్ణాటకలో ఎన్ని కోవిడ్‌ కేసులు నమోదు అవుతాయి? ఏ జిల్లా కోవిడ్‌ జాబితాలో అగ్రస్థానంలో నిలుస్తుంది? ఈరోజు కరోనా మరణాలు ఎన్ని నమోదు అవుతా యి?’ అనే బెట్టింగులు నడుస్తున్నాయి. ముఖ్యంగా ఇలాంటి బెట్టింగులు ఎక్కువగా పాత మైసూరు, చామరాజనగర, ఇతర స్థలాల్లోని గ్రామీణ ప్రాంతాల్లో జోరుగా సాగుతున్నా యి. అది కూడా ఈ బెట్టింగ్‌లు కేవలం రూ 100, రూ 500, రూ. 1000 మేర తక్కువ మొత్తంలో జరుగుతుండడం వల్ల పోలీసుల దృష్టికిపెద్దగా రావడం లేదు.   

చదవండి: 15 రోజుల్లో కేసులు రెట్టింపు కావొచ్చు

మరిన్ని వార్తలు