భాషా సామరస్యాన్ని కాపాడుకోవాలి: ప్రణబ్‌

26 Dec, 2016 03:17 IST|Sakshi
భాషా సామరస్యాన్ని కాపాడుకోవాలి: ప్రణబ్‌

కృష్ణరాజపుర (కర్ణాటక): ఇతర భాషలకు చెందిన ప్రజలతో స్నేహభావంతో మెలిగినపుడే భిన్నత్వంలో ఏకత్వంతోపాటు భాషా సామరస్యాన్ని కూడా కాపాడుకోవచ్చని రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ పేర్కొన్నారు. కృష్ణరాజపుర పరిధిలోని దూరవాణి నగర్‌లో ఉన్న ఐటీఐ విద్యామందిర్‌ పాఠశాలలో ఆదివారం నిర్వహించిన 89వ నిఖిల్‌ భారత్‌బంగ్‌ సాహిత్య సమ్మేళనాన్ని రాష్ట్రపతి ప్రారంభించారు. భాష సంస్కృతిని మరింత అభివృద్ధి చేయడానికి కృషి చేస్తున్న సమ్మేళన సంస్థతో తనకు నాలుగు దశాబ్దాల అనుబంధం ఉందని ప్రణబ్‌ తెలిపారు. గురుదేవ రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ స్థాపించిన ఈ సంస్థ మరి కొద్ది సంవత్సరాల్లో శత వసంతాలు జరుపుకోనుండడం సంతోషకరమన్నారు.

మరిన్ని వార్తలు