కేన్సర్‌ బాధితులం.. ఆదుకోండి!

27 Jul, 2017 05:42 IST|Sakshi
కేన్సర్‌ బాధితులం.. ఆదుకోండి!

కేకే.నగర్‌: కేన్సర్‌ వ్యాధితో బాధపడుతున్న వారు దాతల ఆపన్నహస్తం కోసం ఎదురు చూస్తున్నారు. వైద్య చికిత్స నిమిత్తం ఆర్థిక సాయం అందించి తమను ఆదుకోవాలని అర్థిస్తున్నారు. చికిత్స కోసం కేన్సర్‌ బాధితులు రోషిణి(14), సుదందరదేవి క్రౌడ్‌ ఫండింగ్‌ సంస్థను ఆశ్రయించారు.

రోషిణి:
టీనేజ్‌లో ఆడుతూ పాడుతూ గడపాల్సిన జీవితాన్ని రోషిణి విషాదంగా వెళ్లదీస్తోంది. లింపో ప్లాస్టిక్, లింపోమా అనే కేన్సర్‌ బాధితురాలు రోషిణి. బాలిక చెన్నై అడయారులోని కేన్సర్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఇంకా రెండేళ్ల పాటు చికిత్స అందించాల్సిన అవసరం ఉందని వైద్యులు తెలిపారు. ఇందుకుగాను సుమారు రూ.10 లక్షలు ఖర్చు అవుతుంది. రోషిణి వైద్య ఖర్చుల కోసం మిలాప్‌ ఆర్గనైజేషన్‌ ద్వారా నిధి సేకరిస్తున్నారు. బాలికకు సహాయం చేయాలని అనుకునే దాతలు 9677989830 అనే ఫోన్‌ నంబర్‌లో సంప్రదించవచ్చు.

సుదంధర దేవి:
బ్లడ్‌కేన్సర్‌ బాధితురాలు సుదంధరదేవి(32) మధ్యతరగతి కుటుంబానికి చెందింది. ఈమె తల్లి గతేడాది మృతి చెందింది. తండ్రి విశ్రాంత బ్యాంకు ఉద్యోగి. సుదందరదేవికి బ్లడ్‌కేన్సర్‌ వ్యాధికి కీమో థెరపి చికిత్స నిమిత్తం రూ.15 లక్షల వరకు ఖర్చు అవుతుందని వైద్యులు తెలిపారు. వీరిద్దరి చికిత్సల కోసం దాతలు తమకు తోచినంత ఆర్థిక సాయాన్ని చేయాలని బాధితులు కోరుతున్నారు. వారికి సహాయం చేయదలచిన వారు జ్టి్టpట://ఝజీ ్చ్చp.ౌటజ/p్చyఝ్ఛn్టటఅనే వెబ్‌సైట్‌లో నియమ నిబంధనలను అనుసరించి సాయం చేయాలని సూచించారు.

అత్యాచారం కేసులో వ్యక్తికి రెండు యావజ్జీవ శిక్షలు
అన్నానగర్‌: నామక్కల్‌ జిల్లాలో వివాహితపై అత్యాచారానికి పాల్పడిన కేసులో ఓ వ్యక్తికి నామక్కల్‌ మహిళా హైకోర్టు రెండు యావజ్జీవ శిక్షలను విధిస్తూ బుధవారం సంచలన తీర్పు ఇచ్చింది. నామక్కల్, కాచ్చినల్లూర్‌ సమీపంలో వినాయకపురానికి చెందిన వివాహితను చిన్నాన్న వరుసగల కృష్ణన్‌ 2010వ సంవత్సరంలో అత్యాచారం చేశాడు. ఈ సంఘటనపై ఆమె కుటుంబ సభ్యులు నామక్కల్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు పోలీసులు కృష్ణన్‌ అరెస్టు చేసి జైలుకు తరలించారు. ఈ కేసు మహిళా హైకోర్టులో విచారణ జరుగుతూ వచ్చింది. ఈ క్రమంలో బుధవారం  కేసు విచారణకు వచ్చింది. ఇందులో కూతురు వరుస గల వివాహితను అత్యాచారం చేసిన కేసులో నేరం రుజువుకావడంతో కృష్ణన్‌కి రెండు యావజ్జీవ శిక్షలు విధిస్తూ మహిళా కోర్టు తీర్పు ఇచ్చింది.

మరిన్ని వార్తలు