అన్నయ్యపై వదంతులు నమ్మొద్దు

18 Aug, 2016 12:10 IST|Sakshi
అన్నయ్యపై వదంతులు నమ్మొద్దు

చెన్నై : అన్నయ్య నా.ముత్తుకుమార్ గురించి అసత్య ప్రచారాలను నమ్మవద్దని ఆయన సోదరుడు రమేశ్‌కుమార్ విజ్ఞప్తి చేశారు. ప్రముఖ సినీ గేయ రచయిత నా.ముత్తుకుమార్ అనారోగ్యం కారణంగా ఇటీవల మరణించిన విషయం తెలిసిందే. ఆయన గురించి పలు వదంతులు ప్రచారం అవుతున్నాయి. నా.ముత్తుకుమార్ కుటుంబం పేదరికంలో మగ్గుతోందని, ఆర్థిక సాయం అందించాలని ప్రచారం జరుగుతోంది.

ఈ ప్రచారాలకు స్పందించిన ఆయన తమ్ముడు రమేశ్‌కుమార్ ఓ ప్రకటనలో పేర్కొంటూ తాము అమ్మా అని పిలవడం కూడా తెలియని వయసులోనే తల్లిని కోల్పోయామని తెలిపారు. ఇరుగుపొరుగు, బంధువుల జాలి చూపులు భరించలేక తమ తండ్రి ఏ కార్యక్రమాలకు వెళ్లకుండా దూరంగా పెంచారని పేర్కొన్నారు.

ఇప్పుడు తాము అలాంటి పరిస్థితినే ఎదుర్కొంటున్నామని, అలాంటి జాలి చూపే మాటలు తమ పిల్లలు వినడాన్ని సహించలేమని తెలిపారు. తమకు సాయపడాలన్నదే మీ అందరి భావన అని గ్రహించగలమన్నారు. తన అన్న నా.ముత్తుకుమార్ మంచి స్నేహితులను, అనుబంధాలను సంపాదించుకుని సంతృప్తికరమైన జీవితాన్ని అనుభవించారని పేర్కొన్నారు. అన్నయ్య సినిమాను ఎంతగా ప్రేమించాడో అంతగా అందరినీ తన వారిగానే భావించి కోట్లాది మంది ప్రేమను పొందారని తెలిపారు.

అంత కన్నా వే రే సంపాదన తమకు అవసరం లేదన్నారు. తండ్రి తమను పెంచినట్టుగానే తమ పిల్లల్ని నిరాడంబరంగా పెంచాలనుకుంటున్నామని తెలిపారు. అందుకు అన్నయ్య అన్ని సౌకర్యాలు సమకూర్చార ని పేర్కొన్నారు. తమ కుటుంబం గురించి ఎలాంటి అసత్య ప్రచారాలను నమ్మవద్దని నా.ముత్తుకుమార్ తమ్ముడు రమేశ్‌కుమార్ ప్రకటనలో కోరారు.

మరిన్ని వార్తలు