ప్రేమ పెళ్లికి పోలీసుల భరోసా

21 Apr, 2020 07:30 IST|Sakshi
నూతన వధూవరులు జీవిత, వినోద్‌

చెన్నై, అన్నానగర్‌: తిరుచ్చిలో 144 సెక్షన్‌ అమలులో ఉండగా ఇంటి నుంచి వెలుపలికి వచ్చిన కళాశాల విద్యార్థిని ప్రియుడి వద్దకు చేరుకుంది. వారు ఆలయంలో వివాహం చేసుకున్నారు. తిరుచ్చి చింతామణి గాంధీ నగర్‌కు చెందిన వ్యక్తి రవి. ఈయన కుమారుడు వినోద్‌ (25). ఐటీఐ పూర్తి చేసిన ఇతను తిరుచ్చి అరియమంగళంలో బస్సు, లారీలకు బాడీ తయారు చేసే షెడ్‌లో పని చేస్తున్నాడు. తిరుచ్చి మదురై రోడ్డు జీవానగర్‌కు చెందిన జీవిత (20). ఈమె తిరుచ్చి సత్రం బస్టాండ్‌ వద్ద ఉన్న ప్రైవేటు కళాశాలలో బీఎస్‌సీ మూడో సంవత్సరం చదువుతోంది.

ప్రస్తుతం కరోనా కట్టడి చర్యల్లో భాగంగా కళాశాల, కారు బాడీ తయారీ షెడ్‌ పని చేయడం లేదు. కళాశాల సమీపంలోని పూజారి వీధిలో జీవిత స్నేహితురాలు ఉంది. అప్పుడప్పుడు స్నేహితురాలికి ఇంటికి వెళ్లి రావడం జీవితకు అలవాటు. అలాంటప్పుడే జీవితకు వినోద్‌ మధ్య ప్రేమ ఏర్పడింది. ఇద్దరు వేరు వేరు కులాలకు చెందిన వారు కావడంతో ఇద్దరి కుటుంబీకుల్లో వీరి ప్రేమకు వ్యతిరేకత వెల్లడైంది. ఈ స్థితిలో ఆదివారం కీల్‌ చింతామణి వద్ద ఉన్న ద్రౌపది అమ్మన్‌ ఆలయం వద్ద ఇద్దరు వివాహం చేసుకున్నారు. తమ కుమార్తెను ఇంటికి పంపించాల్సిందిగా కోటై పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసు ఇన్‌స్పెక్టర్‌ షణ్ముగ వేల్‌ వారి కుటుంబ సభ్యులకు అవగాహన కల్పించి, ప్రేమికులను ఒకటి చేశారు.

మరిన్ని వార్తలు