పోలీస్ జీపు బోల్తా.. ఇద్దరికి గాయాలు

17 Oct, 2016 07:48 IST|Sakshi
పోలీస్ జీపు బోల్తా.. ఇద్దరికి గాయాలు

జగిత్యాల (కరీంనగర్‌): వేగంగా వెళ్తున్న పోలీస్ వాహనం అదుపుతప్పి లోయలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఇద్దరు పోలీసులకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన జగిత్యాల జిల్లా కొండగట్టు సమీపంలోని ఘాట్‌రోడ్డులో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. కొండగట్టుకు వెళ్తున్న పోలీస్ జీప్ ఘాట్‌రోడ్డులో అదుపుతప్పి లోయలోకి పల్టీ కొట్టింది.

ఈ ఘటనలో వాహనంలో ఉన్న ఇద్దరు పోలీసులకు తీవ్ర గాయాలయ్యాయి. వారిని వెంటనే సమీప ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న జిల్లా ఎస్పీ అనంత శర్మ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు.

మరిన్ని వార్తలు