పోలీసుల నేత్రాల్లో ఢిల్లీ ర హదారులు

6 Mar, 2015 00:04 IST|Sakshi
పోలీసుల నేత్రాల్లో ఢిల్లీ ర హదారులు

హోలీ సందర్భంగా పటిష్ట భద్రత
కూడళ్లలో ప్రత్యేక తనిఖీలు
వీడియో కెమెరాలతో పర్యవేక్షణ
ట్రాఫిక్ నిబంధన పాటించని వారిపై కఠిన చర్యలు
కమిషనర్  ముక్తేశ్ చంద ర్ వెల్లడి

 
న్యూఢిల్లీ: హోలీ పండుగ సందర్భంగా ఎలాంటి  అవాంచనీయ సంఘటనలు జరగకుండా ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రధాన కూడళ్లలో ప్రత్యేక తనిఖీల కోసం 200 బృందాలను సిద్ధం చేశారు. 20 ఇంటర్‌స్పెక్టర్ వాహనాలతో గస్తీ ముమ్మరం చేయనున్నారు. మద్యం తాగి వాహనం నడపడం, బైక్  విన్యాసాలు, విచక్ష ణా రహితంగా వాహనాలు నడపడంతోపాటు ఇతర ట్రాఫిక్ నియమాలు పాటించని వారిని గుర్తించేందుకు వీడియో కెమేరాలు ఉపయోగిస్తున్నారు. రద్దీ కారణంగా నిందుతులను అప్పటికప్పుడే విచారిచడం లేదు. చలానాలను వారి ఇంటికి పంపిస్తారు. గత సంవత్సరం ఇదే తరహాలో 4000 మంది నిందుతులకు చలానాలు వారి ఇంటికే పంపిచారు. వాహనదారులు ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘిస్తే కేవలం జరిమానాతో సరిపెట్టడం లేదు, వారి వాహనం స్వాధీనం చేసుకోవడంతోపాటు అరెస్ట్ చేసే అవకాశం ఉంది.

డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో పట్టుబడితే డ్రైవర్‌ను అరెస్ట్ చేయడంతోపాటు వాహనాన్ని స్వాధీనం చేసుకుంటామని ట్రాఫిక్ కమిషనర్ ముక్తేశ్ చందర్ చెప్పారు. జరిమానా విధించడం మాత్రమే కాక జైలు శిక్షతోపాటు వారి డ్రైవింగ్ లెసైన్స్ రద్దు చేస్తామని తెలిపారు. పండుగ సందర్భాల్లో హెల్మెట్ ధరించకుండా వాహనం నడపడం, బైక్‌తో వివిధ విన్యాసాలు చేయడం సర్వసాధారణం. అయితే ఏలాంటి ప్రమాదాలు చోటు చేసుకోకుండా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు.

వాహన యజమాని కాకుండా ఇతరులు, మైనర్లు వాహనం నడిపితే యజమానిపై చర్యలు తీసుకుంటామని పోలీసులు వెల్లడించారు. లై సెన్స్ కాలం పూర్తయి ఉన్నా, విచక్షణా రహితంగా వాహనం నడిపినా, హెల్మెట్ వాడకపోయినా నిబంధనల మేరకు చ ర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. పోలీసుల లెక్కల ప్రకారం గత సంవత్సరం చట్టరీత్యా 13,015 మందిపై వివిధ నేరాల కింద చర్యలు తీసుకున్నారు. వీరిలో హెల్మెట్ వాడని కారణంగా 5,633 మందిపై, సిగ్నల్ జంప్ చేసిన నేరంపై 1,544 మందిపై చర్యలు తీసుకున్నారు.
 అదే విధంగా ట్రిపుల్ రైడింగ్ చేస్తున్న 1,464కి, ప్రమాదకరంగా వాహనం నడిపిన 139 మందికి జరిమానాలు విధించారు. మద్యం తాగి వాహనం నడిపిన 2,090 మందికి చట్టరీత్యా శిక్ష విధించారు. అంతేకాక 881 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.
 

మరిన్ని వార్తలు