పాలీ హౌస్‌ల కోసం క్యూలో మంత్రి కుమారుడు !

10 Sep, 2016 04:10 IST|Sakshi
క్యూలో నిలుచున్న మంత్రి కుమారుడు హర్ష (క్యూలో నిలుచున్న నాలుగో వ్యక్తి)

కోలారు : ఓ జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి కుమారుడు సాధారణ వ్యక్తి తరహాలో దరఖాస్తుల కోసం క్యూలో నిలబడి అందరికి ఆదర్శంగా నిలిచారు. జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి రమేష్ కుమార్ కుమారుడు హర్ష పాలీ హౌస్‌ల కోసం శుక్రవారం అందరితో పాటు క్యూలో నిలబడి అందరిచేత శభాష్ అనిపించుకున్నారు. పాలీ హౌస్‌ల కోసం మొదట వచ్చిన 200 దరఖాస్తులకు ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని జిల్లా అధికారులు ప్రకటించడంతో రైతులు దరఖాస్తుల కోసం జిల్లా పంచాయతీ కార్యాలయానికి పెద్ద సంఖ్యలో విచ్చేశారు.

దీంతో హర్ష సైతం ఉదయమే డీపీఓ కార్యాలయానికి చేరుకుని వరుసులో నిలుచున్నారు. పాలీ హౌస్‌లకు సంబంధించి ఎక్కడా కూడా అవినీతి ఆరోపణలు రాకూడదని మంత్రి రమేష్‌కుమార్ ఆదేశాలు జారీ చేయడంతో అధికారులు సైతం బాధ్యతయుతంగా పనిచేస్తున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి కుమారుడు హర్షం సైతం సామాన్య రైతు మాదిరిగా వరుసలో నిలబడి దరఖాస్తు కోసం వేచి ఉండటం అక్కడి వారిని ఆకట్టుకుంది. దీంతో పలువురు హర్ష నిరాడంబరతను అభినందించారు.

మరిన్ని వార్తలు