నిఖా భాగ్య

29 Oct, 2013 00:56 IST|Sakshi

 

= పేద ముస్లిం యువతులకు రాష్ట్ర ప్రభుత్వం వరం
 = వివాహానికి రూ. 50 వేలు

 
సాక్షి, బెంగళూరు : నిరుపేద ముస్లిం యువతుల వివాహాలకు గాను రూ. 50 వేలను నిఖా భాగ్య పథకం పేరుతో ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చింది. ఈ మేరకు సోమవారం అధికారికంగా ఆదేశాలు జారీ చేసింది. ఏడాదికి రూ.1.50 లక్షల కంటే తక్కువ ఆదాయం కలిగిన ముస్లిం కుటుంబంలోని పెళ్లికాని యువతి లేదా వితంతువు ఈ ప్రయోజనం పొందడానికి అర్హులు. నిశ్చితార్థం జరిగిన వెంటనే అర్హులు తమకు దగ్గరలోని మైనారిటీ సంక్షేమశాఖ కార్యాలయానికి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

సంబంధిత అధికారులు క్షేత్రస్థాయి పరిశీలన జరిపి అన్ని సవ్యంగా ఉన్నట్లు నిర్ధారించుకున్న అనంతరం రూ.35 వేలు విలువైన ఇంటి సామగ్రి, రూ.15 వేలును నగదు రూపంలో వధువుకు ఇస్తారు. పెళ్లి తర్వాత సంబంధిత ధార్మికసంస్థ అందజేసే పెళ్లి ధ్రువీకరణ పత్రిక (నిఖా సర్టిఫికెట్) లేదా మ్యారేజ్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్‌ను మైనారిటీ సంక్షేమశాఖకు అందించాల్సి ఉంటుంది.

కాగా, లబ్ధిదారుల వయస్సు పెళ్లి నాటికి రూ.18 ఏళ్లు కచ్చితంగా ఉండాలని, కనిష్టంగా మూడేళ్లు నుంచి రాష్ట్రంలో నివ శిస్తూ ఉండాలనే నిబంధనను ఈ పథకంలో ప్రభుత్వం చేర్చింది. అదే విధంగా దరఖాస్తు చేసుకునే నాటికి, పెళ్లికి మధ్య కనీసం నెల రోజుల సమయం ఉండాలనే నిబంధనను కూడా విధించింది.
 

>
మరిన్ని వార్తలు