'పరువు'కు పోతే ఫైన్ పడింది!

28 Jan, 2016 19:22 IST|Sakshi
'పరువు'కు పోతే ఫైన్ పడింది!

- ఎయిర్ ఇండియా మాజీ అధికారిపై పరువునష్టం దావాలో మాజీ కేంద్ర మంత్రికి షాక్
- విచారణకు హాజరుకాకపోవటంపై కోర్టు ఆగ్రహం.. రూ. 3వేల జరిమానా

 

ముంబై: సాధారణంగా నిందితులు లేదా ఆరోపణలు ఎదుర్కునే వ్యక్తుల గౌర్హాజరుపై ఆగ్రహం వ్యక్యంచేసే కోర్టులు కొన్ని సందర్భాల్లో మాత్రమే పిటిషనర్ తీరును తప్పుబతూఉంటాయి. ఓ ఉన్నతాధికారిపై పరునష్టం దావావేసి కనీసం ఒక్కసారైనా విచారణకు హాజరుకాకుండా తిరుగుతోన్న మాజీ కేంద్ర మంత్రి ప్రఫుల్ పటేల్ విషయంలోనూ ముంబై మెట్రోపాలిటన్ కోర్టు అదేతరహా అసహనం వ్యక్తం చేస్తూ ఏకంగా రూ. 3వేల జరిమానా విధించింది.

ప్రఫుల్ పటేల్ విమానయాన మంత్రిగా ఉన్న సమయంలో తీసుకున్న కొన్ని నిర్ణయాల వల్ల ప్రభుత్వరంగ సంస్థ అయిన ఎయిర్ ఇండియా తీవ్రంగా నష్టపోయిందని ఆ సంస్థ మాజీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ జితేంద్ర భార్గవ తన ఆత్మకథా పుస్తకంలో పేర్కొన్నారు. అయితే జితేంద్ర తన పుస్తకంలో పేర్కొన్న విషయాలు అవాస్తవాలని ఆరోపిస్తూ మంత్రి ఫ్రఫుల్ పటేల్ కోర్టులో పరువునష్టం దావా వేశారు.

ఏళ్లుగా కొనసాగుతున్నప్పటికీ  మాజీ మంత్రివర్యులు ఒక్కసారైనా విచారణకు హాజరుకాలేదు. గురువారం విచారణ సందర్భంగా మరోసారి హాజరు మినహాయింపు కోరిన ప్రఫుల్ పటేల్ తరఫు న్యాయవాదిని కోర్టు చివాట్లు పెట్టింది. 'ఇంకెన్నిసార్లు ఇలా చేస్తారు? మీరు కోర్టు ధిక్కారానికి పాల్పడుతున్నారని అర్థమవుతోందా?' అంటూ ఆగ్రహంవ్యక్తం చేసిన మెజిస్ట్రేట్ వి.పి. అధోనే.. విచారణకు గైర్హాజరవుతున్నందుకుగానూ  ప్రఫుల్ పటేల్ కు రూ.3వేల జరిమానా విధించారు.

మరిన్ని వార్తలు