పరారీలో ప్రత్యూష బాయ్ఫ్రెండ్

2 Apr, 2016 10:47 IST|Sakshi
పరారీలో ప్రత్యూష బాయ్ఫ్రెండ్

ముంబై: బుల్లితెర నటి ప్రత్యూష బెనర్జీ(24) మరణానికి గల కారణాలను ఇప్పుడే చెప్పలేమని ముంబై పోలీసులు చెప్పారు. ఈ కేసును విచారిస్తున్నామని, ప్రత్యూష బాయ్ఫ్రెండ్ రాహుల్ రాజ్సింగ్ను ప్రశ్నించనున్నట్టు తెలిపారు. కాగా రాహుల్ సింగ్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు.

రాజ్ సింగ్‌తో అనుబంధానికి సంబంధించి ఆమె ఇబ్బందులను ఎదుర్కోందని సన్నిహిత వర్గాలు తెలిపాయి. శుక్రవారం మధ్యాహ్నం ఆత్మహత్య చేసుకునే ముందు ప్రతూష్, రాజ్సింగ్లు చాటింగ్ చేసుకున్నట్టు వెల్లడైంది. వాట్సాప్లో ఇద్దరూ పరస్పరం ఆగ్రహం వ్యక్తం చేసుకున్నారు. మధ్యాహ్నం 12:30 గంటలకు ఆత్మహత్య చేసుకుంటున్నట్టు రాజ్సింగ్కు వాట్సాప్ మెసేజ్ పంపింది. అనంతరం 3:30 గంటల సమయంలో ఆత్మహత్య చేసుకున్నట్టు గుర్తించారు. ప్రత్యూష ఆత్మహత్య చేసుకున్న ప్లాట్లో పోలీసులు పరిశీలించారు. సూసైడ్ నోట్ లభించలేదని పోలీసులు చెప్పారు.

డబ్బింగ్ సీరియల్ చిన్నారి పెళ్లికూతురులో ఆనందిగా తెలుగు టీవీ ప్రేక్షకులకు చిరపరిచితురాలైన ప్రత్యూష బెనర్జీ(24) శుక్రవారం మరణించిన సంగతి తెలిసిందే. ముంబై శివార్లలోని బంగూర్‌నగర్‌లో ఉన్న సొంత ఫ్లాట్‌లో ఆమె ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లుగా పోలీసులు భావిస్తున్నారు. ఆమె మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం సిద్ధార్థ్ ఆస్పత్రికి తరలించారు.

మరిన్ని వార్తలు